హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాట్‌స్పాట్‌గా హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న కరోనా: 1000 పైగా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రాణాంతక కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. ఆందోళనకరంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. దీన్ని వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ..ఆ వైరస్ వేగానికి బ్రేకులు పడట్లేదు. గంటగంటకూ చెలరేగిపోతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని చర్యలను తీసుకున్నప్పటికీ ఈ వైరస్ ముందు బలాదూర్ అనిపించేలా ఉంటున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించగా.. ఏపీ మాత్రం సడళింపును ఆశిస్తోంది.

1000కి పైగా కేసులు

1000కి పైగా కేసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి నాటికి తెలంగాణలో 592, ఆంధ్రప్రదేశ్‌లో 439 కేసులు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో మొత్తం 472 మంది కరోనా వైరస్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 103 ఈ వైరస్ బారి నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 17 మంది మృతి చెందారు. ఏపీలో గుంటూరు జిల్లా అత్యధికంగా గుంటూరు జిల్లాలో 93 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 12 మంది డిశ్చార్జి అయ్యారు.

హాట్‌స్పాట్.. గ్రేటర్ హైదరాబాద్..

హాట్‌స్పాట్.. గ్రేటర్ హైదరాబాద్..

కరోనా దెబ్బకు గ్రేటర్ హైదరాబాద్ విలవిల్లాడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 216 పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా కేసుల సంఖ్యలో ఈ స్థాయిలో పెరుగుదల చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. తెలంగాణలో మరే జిల్లాలో కూడా ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు లేవు. నిజామాబాద్ లో 35 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 124 హాట్‌స్పాట్లను గుర్తించింది ప్రభుత్వం.

వైరస్ నియంత్రణలో వేర్వేరు మార్గాలు..

వైరస్ నియంత్రణలో వేర్వేరు మార్గాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. దాన్ని నియంత్రించడానికి ఈ రెండు ప్రభుత్వాలు వేర్వేరు మార్గాలను అనుసరిస్తున్నాయి. కరోనా వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించబోతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఏపీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. లాక్‌డౌన్ పరిస్థితులను రెడ్ జోన్లు, హాట్‌స్పాట్లకు మాత్రమే పరిమితం చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటోంది.

 85 శాతం మర్కజ్ ప్రార్థనలతో లింక్

85 శాతం మర్కజ్ ప్రార్థనలతో లింక్

రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 70 నుంచి 80 శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలతో ముడిపడి ఉన్నవే కావడంనని చెబుతున్నారు. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. అత్యధిక కేసులు ఢిల్లీకి వెళ్లొచ్చిన వారితో ముడిపడి ఉన్నాయని చెబుతున్నాయి.

Recommended Video

Fake News Buster : 03 | సెల్ టవర్స్ నుంచి కరోనా వస్తుందా ? | Oneindia Telugu

English summary
Two Telugu States Andhra Pradesh and Telangana have reported 1000 plus Covid-19, Coronavirus cases. In Andhra Pradesh Covid-19 cases have reported 439 and Telangana reports as 592. Greater Hyderabad Municipal Corporation (GHMC) became a Covid-19 hotspots as 216 Positive cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X