హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగలను పట్టించిన ఫేస్‌బుక్: అరెస్ట్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ దేవాలయంలో చోరికి పాల్పడిన దొంగలను సోషల్ నెట్‌వర్క్ సైట్ అయిన ఫేస్‌బుక్ సహాయంలో పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నల్లకుంట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కాచిగూడ ఏసిపి సీహెచ్ లక్ష్మీనారాయణ, ఇన్‌స్పెక్టర్ జైపాల్‌రెడ్డి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

విద్యానగర్‌లో నివసించే పోలపల్లి శ్రీనివాస్(48) వీఎస్‌టీ వద్ద గల అగర్వాల్ ఇండస్ట్రీస్‌లో పనిచేసేవాడు. ఆ సంస్థ మూత పడటంతో పనిపాట లేకుండా తిరుగుతూ చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో దొంగగా మారాడు. దేవాలయాల్లో భక్తుడి మాదిరిగా వచ్చి దేవతామూర్తుల విగ్రహాలను దొంగిలించి, వాటిని విక్రయించగా వచ్చే డబ్బుతో జల్సాలు చేసేవాడు.

2010లో శ్రీనివాస్ చిలుకలగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. విడుదలైన తరువాత శ్రీనివాస్ తన ప్రవృత్తిని మార్చుకోకుండా తిరిగి ఆలయాల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.

ఇటీవల నల్లకుంట పోలీసుస్టేషన్ పరిధిలోని హన్‌మాన్, సాయిబాబా దేవాలయాల్లో శ్రీనివాస్ భక్తుడిగా వచ్చి నిర్వాహకులు, పూజారుల కళ్లుగప్పి ఇత్తడి, పంచలోహ విగ్రహాలను అపహరించాడు. వాటిని రామ్‌నగర్‌కు చెందిన చీకోటి యాదగిరి, పార్శిగుట్టకు చెందిన దుర్గం కిశోర్‌కు విక్రయించాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు దేవాలయాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి శ్రీనివాస్‌ను గుర్తించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసు ఫేస్‌బుక్‌లో పెట్టారు. శ్రీనివాస్‌ను గుర్తించిన ఓ వ్యక్తి అతని ఎక్కడో ఉంటాడో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన క్రైమ్‌ పోలీసులు ఆదివారం నిందితుడు శ్రీనివాస్‌ను, అతని వద్ద విగ్రహాలను కొన్న చీకోటి యాదగిరి, దుర్గం కిశోర్‌ను అరెస్టు చేశారు.

విగ్రహాలు స్వాధీనం

విగ్రహాలు స్వాధీనం

ఓ దేవాలయంలో చోరికి పాల్పడిన దొంగలను సోషల్ నెట్‌వర్క్ సైట్ అయిన ఫేస్‌బుక్ సహాయంలో పోలీసులు పట్టుకున్నారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

ఆదివారం నల్లకుంట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కాచిగూడ ఏసిపి సీహెచ్ లక్ష్మీనారాయణ, ఇన్‌స్పెక్టర్ జైపాల్‌రెడ్డి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

విద్యానగర్‌లో నివసించే పోలపల్లి శ్రీనివాస్(48) వీఎస్‌టీ వద్ద గల అగర్వాల్ ఇండస్ట్రీస్‌లో పనిచేసేవాడు. ఆ సంస్థ మూత పడటంతో పనిపాట లేకుండా తిరుగుతూ చెడువ్యసనాలకు బానిసయ్యాడు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

ఈ క్రమంలో దొంగగా మారాడు. దేవాలయాల్లో భక్తుడి మాదిరిగా వచ్చి దేవతామూర్తుల విగ్రహాలను దొంగిలించి, వాటిని విక్రయించగా వచ్చే డబ్బుతో జల్సాలు చేసేవాడు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

2010లో శ్రీనివాస్ చిలుకలగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు.

English summary
Two thieves arrested in hyderabad with help of Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X