వివాహేతర సంబంధం:చర్చలంటూ మద్యం తాగించి, కళ్ళలో కారంవేసి గొడ్డలితో ఇలా....

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకొంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు యువకులను కిరాతకంగా నరికి చంపాడు.

భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకొంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు యువకులను కిరాతకంగా నరికి చంపాడు.

కమలాపూర్ కు చెందిన నర్రా శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.ఈ విషయం తెలిసిన మహిళ కుటుంబసభ్యులు నాలుగు రోజుల క్రితం శ్రీనును పిలిపించి మందలించారు. వివాహేతర సంబంధం మానేయాలని సూచించారు.

అయినా శ్రీనివాస్ పెడచెవిన పెట్టాడు.దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు శ్రీనును అతనికి సహకరిస్తోన్న జర్పుల కళ్యాణ్ ను హత్య చేయాలని నిర్ణయించుకొన్నారు.

two young stars murdered for extra marital affair

శనివారం రాత్రి పదిగంటల సమయంలో ఇద్దరిని చర్చల కోసం పిలిచి బాగా మద్యం తాగించి ఇంటి వద్దకు తీసుకెళ్ళి కళ్ళలో కారం చల్లి గొడ్డళ్ళతో నరికి చంపారు.అనంతరం 8 మంది నిందితులు పోలీసులకు లొంగిపోయారు.

ఆదివారం ఉదయం శ్యామ్ లాల్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు వెంటపెట్టుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+