'కట్టుబట్టలతో వచ్చినా ఆత్మవిశ్వాసం సడలలేదు','అద్భుత ఫలితాలను సాధిస్తాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. పలు పార్టీ కార్యాలయాల్లోనూ, రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

హైద్రాబాద్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు పలువురు అదికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడ పాల్గొన్నారు.

విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

హైద్రాబాద్ లోని వైసిపి కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆ పార్టీ చీఫ్ జగన్ పాల్గొన్నారు. హైద్రాబాద్ తో పాటు విజయవాడ, గుంటూరులలో ఉన్న పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కొత్త ఏడాది అద్భుత ఫలితాలు ఇస్తోంది

కొత్త ఏడాది అద్భుత ఫలితాలు ఇస్తోంది

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని కోరారు. శాంతిభద్రతల విషయంలో దేశానికి తలమానికంగా ఉంటుంది. సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా ఉంటాం.రాష్ట్రంలో మంచిపంటలు పండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్ళేందుకు అహర్నిశలు కృషి చేస్తామని ఆయన చెప్పారు.శాంతి భద్రతల విషయంలో రాజీపడబోనని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.కొత్త ఏడాది అద్భుత ఫలితాలను ఇస్తోందని చెప్పారాయన.

కట్టుబట్టలతో వచ్చినా ఆత్మవిశ్వాసం తగ్గలేదు

కట్టుబట్టలతో వచ్చినా ఆత్మవిశ్వాసం తగ్గలేదు

ఉగాది తెలుగువారి సంప్రదాయమని తెలుగు నూతన సంవత్సరమని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జీవితంలో అన్ని సుఖాలే కాదు, సమస్యలు కూడ ఉంటాయన్నారు.

అన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. బుదవారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.తెలుగు భాషను కాపాడుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటామన్నారు.త్వరలో కూచిపూడి నాట్యరామాన్ని ప్రారంభిస్తామని చెప్పారు చంద్రబాబునాయుడు.విభజన తర్వాత రాష్ట్రానికి కట్టుబట్టలతో వచ్చినా ఆత్మవిశ్వాసం తగ్గలేదన్నారు.

ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తాం

ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తాం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాదివేడుకలను నిర్వహించారు.గాంధీభవన్ లో నిర్వహించిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

2019 వైసిపికి కలిసివస్తోంది

2019 వైసిపికి కలిసివస్తోంది


పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఉగాది రావడం సంతోషకరంగా ఉందని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.టిడిపిని దెబ్బతీయాలని కేసీఆర్ కుట్ర చేస్తోన్నారని ఆయన తెలిపారు.టీడీపి కార్యకర్తల పార్టీ అని తమ పార్టీని ఎవరు ఏం చేయలేరన్నారు రేవంత్ రెడ్డి.హైద్రాబాద్ లోని వైసిపి కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో వైసిపి అధినేత జగన్ పాల్గొన్నారు.2019 వైసిపికి కలిసివస్తోందని పంచాంగకర్త రామచంద్రశాస్త్రి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ugadi celebrations held two telugu states on wednesday.ap cm participated ugadi celebrations at vijayawada,telangana cm kcr participated ugadi celebrations at pragati bhavan.
Please Wait while comments are loading...