ఘనంగా ఉగాది వేడుకలు.. ఈ ఏడాదిపై ఆశల పల్లకీలో రాజకీయ పార్టీలు!
నూతన తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ ఉగాదిని వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉగాదిపై గంపెడు ఆశలు పెట్టుకుని, ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. BJP రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు G కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు.
ఈ ఏడాదిపై బీజేపీ ఆశ
సామూహికంగా ప్రజలందరూ కలిసి ఉండాలని పండుగలు సూచిస్తాయని, రాష్ట్రం దేశం మరింత సస్యశ్యామలంగా ఉండాలనీ ఆకాంక్షించారు.ఈ కొత్త సంవత్సరంలో పార్టీని బలోపేతం చేయటానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలు త్వరలోనే ఏర్పాటు అవుతాయని వెల్లడించారు. ఈ సంవత్సరం బీజేపీ తెలంగాణలో బాగా పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రగతిపై కాంగ్రెస్ ఆశాభావం
కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యలయం హైదరాబాద్- గాంధీ భవన్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. PCC అద్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తమ పార్టీ పాలన అందిస్తోందని అన్నారు. పార్టీ కార్యాలయం గాంధీ భవన్ పేదల దేవాలయం లాంటిదని పేర్కొంటూ, ఈ విశ్వావసు సంవత్సరం లో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించాలనీ, ప్రజలకు సంక్షేమఫలితాలు అందాలనీ మహేశ్ గౌడ్ అభిలషించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష
శ్రీ విశ్వావసు నామ అధికారిక ఉగాది వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంగరంగా వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ,
సీఎం రేవంత్ రెడ్డి విద్యా వైద్యం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని చెప్పారు. దేశంలోనే తెలంగాణా ఒక వెలుగు వెలగాలనీ, ప్రపంచంలోనే రాష్ట్రం విలక్షణ గుర్తింపు తెచ్చుకోవాలని అభిలషించారు.
ఉగాదికి కేటీఆర్ ఆకాంక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఆశలు, కోటి ఆకాంక్షలతో మొదలైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ సకల విజయాలు చేకూరాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవదాయ ధర్మదాయ శాఖల అధ్వర్యంలో జరిగిన వేడుకలు సంప్రదాయ సిద్ధంగా వేద ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, విశేష సేవలందించిన పలువురికి ఉగాది పురస్కారాలు అందజేత లాంటి వేడుకలతో వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే భద్రాచల శ్రీ సీతామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ ఆహ్వాన రాజపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు అందజేశారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications