లష్కర్ బోనాలకు రండి: సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం(ఫొటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండుగకు హాజరవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును సికింద్రబాద్ మహంకాళి ఆలయం కమిటీ సభ్యులు, వేదపండితులు, రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు.

ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి నివాసానికి వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, వేదపండితులు వచ్చారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగకు రావాలని సిఎంను వారు ఆహ్వానించారు. ఈ బోనాల పండుగను ఆగస్టు 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు పండితులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సిఎం కెసిఆర్‌ను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications