అందువల్లే ప్రమాదం జరిగిందేమో: నటుడు భరత్ మృతిపై బాబాయి

ప్రమాదానికి ముందు రెండు గంటలు స్విమ్మింగ్ చేసిన భరత్ రాజు అలసిపోయి వాహనం నడిపి ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఆయన బాబాయ్ మూర్తి రాజు చెప్పారు.

హైదరాబాద్: ప్రమాదానికి ముందు రెండు గంటలు స్విమ్మింగ్ చేసిన భరత్ రాజు అలసిపోయి వాహనం నడిపి ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఆయన బాబాయ్ మూర్తి రాజు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ సమీపంలో ఔటర్ రింగు రోడ్డు ప్రమాదంలో నటుడు రవితేజ సోదరుడు భరత్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.

Uncle on telugu actor Ravi Teja’s brother Bharath death

రహదారిపై ఆగి వున్న లారీని భరత్‌ ప్రయాణిస్తున్న స్కోడా కారు(టీఎస్‌09 ఈసీ 0799) వేగంగా ఢీకొంది. కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

దీనిపై ఆయన బాబాయ్ మూర్తిరాజు స్పందించారు. తమ్ముడితో ఉన్న అనుబంధం వల్లనే రవితేజ అంత్యక్రియలకు రాలేకపోయాడన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ భరత్ ముఖాన్ని చూసి తట్టుకోలేకనే రాలేకపోయారన్నారు.

ఒకప్పుడు ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం బాగా ఉంటున్నాడని తెలిపారు. లారీ కనిపించకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. స్నేహితుడిని కలసి వస్తుంటేనే ప్రమాదం జరిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+