ఆగని కీచకపర్వం : మైనర్‌పై మేనమామ అఘాయిత్యం ...
హైదరాబాద్ : మొన్న ఓరుగల్లు, నిన్న భాగ్యనగరం .. నేడు రంగారెడ్డి కీచకుల దుశ్సాసనం పర్వం కొనసాగుతుంది. అయితే చిన్నారులపై లైంగిక దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని చట్టాలున్న .. అమలు ఆలస్యమవడంతో కీచకులు మరింత రెచ్చిపోతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట పసి పిల్లలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పేరెంట్స్ ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది.
అత్యాచార భారత్ ..
నిర్భయ తర్వాత దేశం అత్యాచార భారత్‌గా మారిందనే చెప్పాలి. దేశంలో ఎక్కడో చోట ప్రతీ నిత్యం లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో సొంత బంధువులు ఆకృత్యానికి తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మామ బరితెగించాడు. రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బుద్వేలు ఘోరం జరిగింది. వరుసకు మామ అయ్యే వ్యక్తి ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
Recommended Video


మభ్యపెట్టి ..
ఆ బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమెను బంగ్లా పైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలిక పరిస్థితిని గమనించి .. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనను బాలల హక్కుల సంఘం తప్పుపట్టింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మృగాళ్ల కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరింది.












Click it and Unblock the Notifications