వేములవాడలో ఆగని కోడెల మృత్యుఘోష..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. గడిచిన రెండు రోజులుగా అక్కడి గోశాలలో కోడెల మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గత శుక్రవారం ఒక్కరోజే ఎనిమిది కోడెలు ప్రాణాలు కోల్పోగా.. ఈరోజు ఉదయం మరో ఐదు కోడెలు మృతి చెందడం సర్వత్రా కలకలం రేపుతోంది. అంతే కాకుండా మరణించిన కోడెలను గోప్యంగా మూలవాగులో ఖననం చేయడం మరో వివాదానికి దారితీస్తోంది.

గోశాలలో జరుగుతున్న పరిస్థితులను జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించి చర్యలు సూచించినా.. వాటిని గోశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గోశాల నిర్వాహకుల తీరుపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

unending-deaths-of-cows-in-vemulawada-become-hot-topic-in-telangana

అయితే భక్తులు దేవుడికి సమర్పించే కోడెలను గోశాలలో తగిన శ్రద్ధతో సంరక్షించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖదే. కానీ ఇప్పుడవి మరణిస్తుండటంతో వీహెచ్‌పీ స్పందించింది. కోడెల పంపిణీ ప్రక్రియను నిర్వాఘాతంగా కొనసాగించాలని, సమస్య పరిష్కారానికి వెంటనే స్థిరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రస్తుతం తిప్పాపూర్ గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో తొక్కిసలాట జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది కోడెల మరణాలకు ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు. భక్తులు సమర్పించే కోడెలను సంరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రతి రోజూ 8-10 కోడెలు చనిపోతున్నాయని సమాచారం. ప్రభుత్వం ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రాంతీయ యంత్రాంగం చేతులెత్తేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మృత్యువాత పడుతున్న కోడెలను ఖననం చేయడం తప్ప, అసలు సమస్యపై ఎటువంటి శాశ్వత పరిష్కారం చూపడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

మరోవైపు ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే గోశాలల ఏర్పాటుకు ఉన్నతస్థాయి కమిటీను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ కాలేజీలు, దేవాలయాల భూముల్లో మొదటి దశలో గోశాలలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గోవుల సంరక్షణకు అవసరమైన బడ్జెట్ అంచనాలు, నిర్వహణ మార్గదర్శకాలు త్వరగా రూపొందించాలని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+