కేసీఆర్ ఊహించనిరీతిలో చత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ళ విచారణ!!

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం ప్రస్తుతం పెను దుమారమే రేపింది. చత్తీస్గడ్ విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈఆర్సి అనుమతి లేకుండానే ఈ వ్యవహారం అంతా జరిగిందని, డిస్కంలు కమిషన్ ముందు వెల్లడించాయి.

విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్
ఇక ఇదే విషయాన్ని ఈరోజు విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కరెంటు కొనుగోలు ఒప్పందం జరిగిందని పవర్ కమిషన్ ముందు తెలిపారు. చత్తీస్ గడ్ తో జరిగిన కరెంటు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాల వ్యవహారంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది

Unexpected shocks for brs chief KCR over electricity purchase and yadadri and badradri plants issue

కేసీఆర్ లేఖలో చెప్పిందంతా తప్పే
కేసిఆర్ కు ఈ అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన సరైన సమాధానం చెప్పకుండా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి వైదొలగాలంటూ లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఇఆర్సి ఆమోదించిందని, న్యాయవిచారణ అవసరం లేదని తేల్చి పారేశారు. అయితే తాజాగా ఇఆర్సి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు చెప్పడంతో కేసీఆర్ నిర్లక్ష్యంగా చేసిన పనులు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయన అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కేసీఆర్ లేఖను వాస్తవాలతో పోల్చి చూస్తున్న కమీషన్
విద్యుత్ కొనుగోళ్లలో ఎటువంటి అక్రమాలు జరగకపోతే, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు లేకుంటే నిబంధన ప్రకారం కేసీఆర్ ఎందుకు వ్యవహరించలేదు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారం పైన పవర్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లేఖ రాసిన కేసీఆర్ లేఖలోని అంశాలను వాస్తవాలతోటి పోల్చి చూసే ప్రయత్నం చేస్తుంది కమిషన్. ఈ క్రమంలోనే నిజంగానే ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా అన్నది దర్యాప్తు చేసింది.

ఆధారాలతో ఈఆర్సీ ఆమోదం ఇవ్వలేదన్న విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు
చత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందాల పైన ఈఆర్సి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, పవర్ ప్లాంట్ ల నిర్మాణం జరిగిన తీరుతెన్నులపై విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కమీషన్ ముందు అనేక కీలక విషయాలను ఉంచారు. కరెంటు ఒప్పందానికి ఈఆర్సి ఆమోదం లభించలేదని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. చత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకోవడం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు.

తాడే పామై కేసీఆర్ ను కరుస్తుందా
ఇరు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఎం ఓ యు చేసుకున్నాయని నాటి ప్రభుత్వం కాంపిటీటివ్ బిడ్డింగ్ వెళ్లకపోవడంతో భారీగా నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక చత్తీస్గడ్ రాష్ట్రం తో ప్రతి సంవత్సరం 1000 మెగావాట్ల సరఫరాకు విద్యుత్ ఒప్పందం జరిగినా, ఆ రాష్ట్రం ఏ సంవత్సరం ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో కరెంటు సప్లై చేయలేదని తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయంగా మళ్ళీ విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చేదని ఫలితంగా వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని వివరించారు. మొత్తంగా చూస్తే చత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారం తాడే పామై కేసీఆర్ ను కరిచేలా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+