ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు - అమిత్ షా..!!
దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.
పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. హైదరాబాద్లో సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేసే వైఖరిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామని అమిత్ షా స్పష్టం చేసారు. సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదని చెప్పారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకల్లో అమిత్ షా కీలక ప్రసంగం చేసారు. గతంలో ఈ ఉత్సవాలు న్యూఢిల్లీలోనే జరిగేవి. న్యూఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి.

మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని వివరించారు. దీనిని సాధించడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
1969 మార్చి 10న 3వేల సిబ్బందితో ప్రారంభమైన సీఐఎస్ఎఫ్ లక్షా 80 వేల మందికి చేరుకుందని అమిత్ షా వివరించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్‌షా చెప్పుకొచ్చారు. మోదీ సర్కార్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన వైఖరి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని అమిత్ షా స్పష్టం చేసారు.

దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే కఠినంగా అణచి వేస్తామని హెచ్చరించారు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గుతోందని వివరించారు. 'రైజింగ్ డే' వేడుకల సందర్భంగా సీఐఎస్ఎఫ్ సత్తాను కళ్లకు కట్టేలా నిర్వహించిన కవాతులు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications