Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణకు అమిత్ షా - బీజేపీలో ముఖ్య నేతల చేరిక..!?

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు 23వ తేదీన పర్యటన ఖరారైంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల పైన ఫోకస్ చేసిన బీజేపీ తదుపరి లక్ష్యంగా తెలంగాణాగా డిసైడ్ అయింది. తెలంగాణకు చెందిన సీనియర్లకు కర్ణాటక ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించారు. అమిత్ షా పర్యటన సమయంలో తెలంగాణలో భారీ సభకు పార్టీ నేతలు నిర్ణయించారు. ఆ సభా వేదికగానే పార్టీలో ముఖ్య నేతల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, అమిత్ షా పర్యటన పైన ఆసక్తి కనిపిస్తోంది.

తెలంగాణలో ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో తమ లక్ష్యంగా ఏంటో హైదరాబాద్ సభలో స్పష్టం చేసారు. తెలంగాణ లో వరుసగా పార్టీ జాతీయ నేతల పర్యటనలను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందుగానే పార్టీలో ముఖ్య నేతలను చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా అమిత్ షా పర్యటన సమయంలో చేవెళ్ల నియోజకవర్గం లో భారీ సభకు బీజేపీ సిద్దం అవుతోంది. ఈ సభా వేదికగా పార్టీలో నేతల చేరికలు ఉండేలా వ్యూహం సిద్దం చేస్తోంది.

 Amith Shah tour in Telangana

దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. మే 10న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది బీజేపీ వ్యూహం. ఇందుకోసం ఎన్నికల్లో హోరా హోరీగా కాంగ్రెస్ తో పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక తరువాత బీజేపీ లక్ష్యంగా తెలంగాణ అని పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్కువ సమయం తెలంగాణలోనే ఉంటారని పార్టీ నేతలు వెల్లడించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తో పాటుగా సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ తెలంగాణలోనే మకాం వేసి ఎన్నికల దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ పార్టీ ముఖ్య నేతల సభ ఉండేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

 Amith Shah tour in Telangana

అమిత్ షా తాజాగా తెలంగాణలో తమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రియా శీలకంగా కొన్ని మార్పులు కూడా ఉంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక, చేవెళ్ల సభలో మాజీ మంత్రి బీజేపీలో చేరుతారని పార్టీ నేతల నుంచి అందుతున్న సమచారం. మాజీ మంత్రి జూపల్లి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. జూపల్లిని ఇప్పటికే డీకే అరుణ బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 23న జూపలితో పాటుగా పొంగులేటి తమ మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పుడు అదే రోజు అమిత్ షా పర్యటక ఖరారైంది. దీంతో, అసలు బీజేపీలో చేరే నేతలు ఎవరనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+