దత్తాత్రేయకు అస్వస్థత: ముక్కు నుంచి రక్తస్రావం, ఆస్పత్రిలో చికిత్స
వరంగల్: బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు బిజెపి నిర్వహించిన సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు.
ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న దత్తాత్రేయ ఒక్కసారిగా కుప్పకూలినట్లు చెబుతున్నారు. ఆయన ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలో ఉన్న మ్యాక్స్ కేర్ ఆస్పత్రికి తరలించరాు.

ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, బిజెపి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.
బుధవారంనాడు కాంగ్రెసు నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇద్దరు ఎంపీలున్న తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదని, తెలంగాణ కాంగ్రెసు నాయకుల కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications