బీజేపీ టార్గెట్ అదే.. మిస్డ్ కాల్ ఇవ్వాలన్న కేంద్రమంత్రి బండి సంజయ్!

బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ లో భాగంగా తెలంగాణా రాష్ట్రంలో 77 లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీ సభ్యత్వం కావాలంటే 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. తెలంగాణలోరామరాజ్యం స్థాపన కోసం నడుం బిగించి పోరాడాలన్నారు.ఏ స్వార్ధ్యం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలన్నారు.

బీజేపీని బలోపేతం చెయ్యాలి
తెలంగాణలో అతి తక్కువ కాలంలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్న బండి సంజయ్, బీజేపీని బలోపేతం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలన్నదే పార్టీ లక్ష్యం అన్నారు.బీజేపీ సభ్యత్వ నమోదును కార్యకర్తలంతా సీరియస్ గా తీసుకోవాలన్నారు. సామాన్య కార్యకర్తలు ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగిన చరిత్ర ఒక్క బీజేపీలోనే సాధ్యం అన్నారు.

Union Minister Bandi Sanjay call to people to give a missed call those who are ready to join in BJP

బీజేపీలో కష్టపడిన వారికి గుర్తింపు
తాను ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.2019కి ముందు నార్త్ బ్లాక్ లోకి వెళ్లలేక బయట నుండే సెల్ఫీ తీసుకున్న చరిత్ర నాదని, నేడు అదే నార్త్ బ్లాక్ లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నానన్నారు. గుర్తింపు కోసం ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు. కష్టపడి కమిట్ మెంట్ తో పనిచేస్తే బీజేపీలో గుర్తింపు తధ్యం అన్నారు.

అత్యధిక సభ్యత్వం చేయించాలని పిలుపు
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు వచ్చినయ్ 77 లక్షల మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించేందుకు ప్రయత్నం చెయ్యాలన్నారు. స్థానిక సంస్థల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులంతా... మీ మీ గ్రామాలు, మండలాల్లో అత్యధిక సభ్యత్వం చేయించండని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నేడు నా బూత్ నా కార్యశాల సభ్యత్వ నమోదులో పాల్గొన్న బండి సంజయ్
కరీంనగర్ చైతన్యపురిలోని బీజేపీ జిల్లా కార్యాలయా నికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ 'నా బూత్ నా కార్యశాల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పోలింగ్ బూత్ ల పరిధితలో అత్యధికంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయించేలా కృషి చేయాలని కోరారు.

బీజేపీ సభ్యత్వం కోసం నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమన్న బండి సంజయ్
బీజేపీ సభ్యత్వం కావాలనుకునే వాళ్లంతా వెంటనే 8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లాలోని కార్మిక సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార, వృత్తి సంఘాలతోపాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతి ఒక్కరినీ కలిసి బీజేపీ సభ్యత్వం తీసుకునేలా కృషి చెయ్యాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+