తెలంగాణా అప్పుల్లో నెంబర్ వన్; ఆ లెక్కలు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్!!

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 8వ నీతిఆయోగ్ సమావేశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకపోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాలకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కెసిఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లకపోవడం సరైనది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాకముందు రాష్ట్రంలో ఆదాయం ఎంత ఉందో చెప్పాలి అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 kishanreddy

ఆదాయానికి మించిన అప్పులు చేస్తూ, పాత అప్పులకు వడ్డీలు చెల్లించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం అప్పులతోనే జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారని, 30 వేల ఎకరాలు అమ్మాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 దీనికోసమే చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా దేశంలో దశాబ్ది ఉత్సవాలను ప్రచారం చేయడానికి చూస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని చెబుతున్నారని, నిరుద్యోగుల ఆత్మహత్యలు లేని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులను ,నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

కెసిఆర్ కు మాట తప్పడం, మడమ తిప్పడం అలవాటేనని పేర్కొన్న కిషన్ రెడ్డి దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పాడు అని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాట తప్పుతూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏమైనా రియల్ ఎస్టేట్ కంపెనీనా అంటూ ప్రశ్నించిన ఆయన ఎక్కడ చూసినా భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+