కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక లీడర్ షిప్ అవార్డు
హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్ షిప్ అవార్డు వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టూ-పీపుల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సంస్థ ఈ అవార్డును బహూకరించింది.
భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు పర్యాటక అభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా కిషన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కిందని తెలిపారు. పర్యాటకరంగంలో దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Humbled to have received the ‘Leadership Award’ from The US India SME Council - an organization that promotes trade, commerce, and people-to-people exchange programs between the US 🇺🇸 & India🇮🇳
— G Kishan Reddy (@kishanreddybjp) July 15, 2023
The award was conferred by eminent citizens from Maryland state, US in recognization… pic.twitter.com/oU628qrMiS
కాగా, పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం వేదికగా ఇటీవల జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో.. ముందుకెళ్లినప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
భారతదేశం వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పర్యాటక రంగంలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు వెళుతోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో "సుస్థిరమైన పర్యాటక సాధన కోసం జాతీయ ప్రణాళిక" అనే కార్యక్రమం కింద 7 లక్ష్యాలతో సుస్థిరమైన పర్యాటకాన్ని సాధించటం కోసం జాతీయ ప్రణాళికను రూపొందించిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications