వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని.. సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో లేఖల రాజకీయం జోరందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నేతలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంలోని బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ అధికార టీఆర్ఎస్, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తూ ఉండటం ఇరు పార్టీల మధ్య కొన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి అద్దం పడుతుంది.

వారికి అడుగడుగునా అవమానాలే.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ!!వారికి అడుగడుగునా అవమానాలే.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ!!

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరుస లేఖాస్త్రాలు

ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన లేఖ ద్వారా స్పష్టం చేశారు. మూడేళ్ల నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన వెల్లడించారు.

తెలంగాణాలో ఈడబ్ల్యూఎస్ అమలు విషయంలో కేసీఆర్ కు లేఖ

తెలంగాణాలో ఈడబ్ల్యూఎస్ అమలు విషయంలో కేసీఆర్ కు లేఖ

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లకు పైగా పట్టింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయ్ అని తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇంత సమయం పట్టింది అని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఇప్పుడు కూడా అమలు సంతృప్తికరంగా లేదని, ఇంకా అసంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేయబడిందని వెల్లడించారు.

 కేంద్రం తెచ్చిన సవరణతో ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి నష్టం జరగలేదు

కేంద్రం తెచ్చిన సవరణతో ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి నష్టం జరగలేదు


కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో తీసుకువచ్చిన సవరణతో ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అదనంగా 2.15 లక్షల సీట్లు ఇవ్వడం కోసం 4315.15 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని కిషన్ రెడ్డి లేఖలో వెల్లడించారు.

Recommended Video

Telangana: Revanth Reddy హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసులు | Oneindia Telugu
 తెలంగాణా రైల్వే ప్రాజెక్ట్ లకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలతో లేఖ రాసిన కిషన్ రెడ్డి

తెలంగాణా రైల్వే ప్రాజెక్ట్ లకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలతో లేఖ రాసిన కిషన్ రెడ్డి

ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా కొత్త విషయాలను ప్రస్తావిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి 3048 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వే పనులకోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులను 25 శాతం పెరిగినట్లు వెల్లడించారు. బడ్జెట్లో తెలంగాణ రైల్వే కేటాయింపులకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా లెక్కలతో సహా పంచుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

English summary
Union Minister Kishan Reddy wrote a letter to CM KCR to implement EWS reservations. He commented that the Telangana government had forgotten the EWS reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X