హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్.. జరుగుతుందిదే!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు సంబంధించి ఆ లేఖ ద్వారా కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ లేఖలో మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తు, నిర్వహణ బాధ్యతలు, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంపై కీలక ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.

మెట్రో మొదటిదశపై సీఎంకు కేంద్రమంత్రి సలహా
ముఖ్యంగా మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడంపై తక్షణ స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. గత కొంత కాలంగా హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటామని, నష్టాలలో ఉన్నప్పటికీ ప్రజల సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని లేఖ ద్వారా గుర్తు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రక్రియపై రేవంత్ రెడ్డికి సూచన చేశారు.

Union Minister kishan reddy letter to CM Revanth over Hyderabad Metro Rail second phase

మెట్రో రెండో దశ పనులు జరగాలంటే ఇలా చెయ్యాలన్న కేంద్రమంత్రి
ఈ అంశంపై తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో చర్చించినట్లు ఆయన తెలిపారు.ఈ ప్రక్రియ త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. తాను రెండో దశ పనులు వేగవంతం కావాలంటే, అంతకు ముందు మొదటి దశకు సంబంధించిన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, బదిలీ ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.

రాష్ట్రం నుండి అధికారుల పేర్లు ఇవ్వాలని విజ్ఞప్తి
మెట్రో రెండో దశ నిర్మాణ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఈ కమిటీలో కేంద్రం తరఫున ఇద్దరు, రాష్ట్రం తరఫున ఇద్దరు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రక్రియను పూర్తిచేసినప్పటికీ, రాష్ట్రం నుంచి అధికారుల పేర్ల ప్రతిపాదన ఇంకా కేంద్రానికి అందలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.

మెట్రో రెండో దశపై కేంద్రం ఆలోచన చెప్పిన కిషన్ రెడ్డి
రెండో దశ మెట్రో నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, రాష్ట్రం నుంచి అధికారుల పేర్లు వస్తే పనులు ముందుకు సాగుతాయని లేఖ ద్వారా కిషన్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి మెట్రో సౌకర్యాన్ని నగర నలుమూలలకు విస్తరించడం లక్ష్యంగా రెండో దశ విస్తరణ పని చేస్తుంది.

ఈ పనులు పూర్తయితేనే కేంద్రం నుండి రెండోదశ నిధులు
విమానాశ్రయం మార్గం, ఇతర రద్దీ ప్రాంతాలను అనుసంధానించేలా ఈ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బదిలీ ప్రక్రియ, అధికారుల నియామకం పూర్తయితేనే కేంద్రం రెండో దశ పనులకు నిధులను విడుదల చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+