రాష్ డ్రైవింగ్: సుజనా చౌదరి కుమారుడు కార్తీక్‌పై కేసునమోదు
హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనాచౌదరి కుమారుడు సాయి కార్తీక్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేబీఆర్ పార్క్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు కారు రేసింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో అతివేగంగా కారు నడుపుతున్న సుజనా చౌదరి కుమారుడు సాయి కార్తీక్ తోపాటు నలుగురు కారు రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అర్ధరాత్రి అతివేంగా కారు నడిపినందుకు సుజనాచౌదరి కుమారుడు సాయికార్తీక్‌పై సెక్షన్ 184(బి) కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
సాయికార్తీక్ నడుపుతున్న జర్మన్ స్పోర్ట్స్ కారు(నెంబర్ ఏపీ 09 సీవీ 9699)ను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications