దట్టమైన అడవిలో అద్భుతమైన కోట.. ట్రెక్కింగ్ కు బెస్ట్ ప్లేస్..!

తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, చివరగా నిజాం రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో కట్టడాలను, కళా కృతులను నిర్మించారు. వందల సంవత్సరాలు ముగుస్తున్నా అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. తెలంగాణలోని ప్రతి జిల్లాలో చారిత్రక ఆలయాలు, కట్టడాలు, డ్యామ్ లు మనకు దర్శనమిస్తుంటాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోనూ అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. వాటిల్లో ముందుగా చెప్పుకోవలసింది గాంధారి ఖిల్లా..

ఆనాటి రాజుల పరిపాలన, పోరాట ప్రతిమలను చిహ్నంగా గాంధారీ ఖిల్లా నిలుస్తోంది. ఈ పూరాతన కోట ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉంది. ఇటీవలి కాలంలో ఈ కోట సందర్శనకు పర్యటకుల సంఖ్య పెరిగింది. సోషల్ మీడియా ప్రభావంతో ఈ కోట యూట్యూబ్ రీల్స్, ఇన్ స్టా రీల్స్ ద్వారా ప్రజల్లోకి చేరింది. దాంతో ఈ కోటను సందర్శించేందుకు పర్యటకులు విశేష సంఖ్యలో వస్తున్నారు. వీకెండ్స్ లో ట్రెక్కింగ్ కు ఈ కోట అనువైన ప్రదేశంగా ఉంది.

చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో పురాతన కోట అటు పర్యటకులతోపాటు ప్రకృతి ప్రేమికులను, చరిత్ర కారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కోట హైదరాబాద్ నుంచి దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. గాంధారి ఖిల్లాకు దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ కోట కాకతీయుల కళా వైభవం, గోండు ప్రజల జీవన విధానం గురించి తెలియజేస్తుంది.

కాకతీయుల అనంతరం ఈ కోట నుంచి వారి సామంతులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టం అవుతోంది. ఇక ఈ కోటలో మైసమ్మ ఆలయం, కాలభైరవ ఆలయం, అలాగే పడగతో ఉన్న ఆదిశేషుడు విగ్రహాలు అబ్బుర పరుస్తున్నాయి. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది. అలాగే ఈ కోటపై మూడు బావులు కూడా ఉండటం విశేషం. ఇక పర్యటకులు ఈ కోటకు ట్రెక్కింగ్ కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు.

Unlock the Secrets of Gandhari Fort in Mancherial District Complete History Location amp amp Tips Here

దట్టమైన అడవి మధ్య ఈ గాంధారి ఖిల్లాను ట్రెక్కింగ్ ద్వారా చేరుకునేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ కోటను చేరుకోవాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న పని. అందుకే అడ్వెంచర్ అంటే ఇష్టపడే ఔత్సాహికులు ఈ కోటను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ గాంధారీ ఖిల్లాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. ఈ కోటలో ప్రతి రెండేళ్లకోసారి గాంధారి మైసమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతర తెలంగాణలోని విశేషమైన జాతర్లలో ఒకటిగా ఉంది. ఈ మైసమ్మ జాతరకు.. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌ ఘడ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+