• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెగా కోడలి మెగా ఛాలెంజ్: ఇకపై టాయ్‌లె‌ట్‌లో ఇలా కూర్చుందాం: మల విసర్జన పొజీషన్‌పై మే 3న

|

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ షాకింగ్ ఛాలెంజ్‌కు దిగారు. మల విసర్జన సమయంలో టాయ్‌లెట్‌లో కమోడ్‌పై ఎలా కూర్చోవాలనే అంశానికి సంబంధించిన ఛాలెంజ్ అది. వెస్టర్న్ కమోడ్‌ కంటే భారతీయ కమోడ్‌లను వినియోగించడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమనే విషయాన్ని తెలియజేయడానికి ఉపాసన ఈ ఛాలెంజ్‌ను విసిరారు. వచ్చేనెల 3వ తేదీన తాను ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నానని ప్రకటించారు.

  Upasana Konidela Showing Her Indian Toilet Position | Take a Bow, Netizens Lauded

  లలిత జ్యువెలర్స్ గుండుబాస్ పాయె..మెగాస్టార్ వచ్చే..కరోనా అవగాహన కోసం టీవిల్లో తరచూ కనిపిస్తున్న చిరు

  ఇండియన్ స్టైల్ అత్యుత్తమం..

  ఇండియన్ స్టైల్ అత్యుత్తమం..

  మోకాలి నొప్పి ఉన్న వారు సాధారణంగా టాయ్‌లెట్‌లో ఇండియన్ స్టైల్ కమోడ్‌పై ఎక్కువసేపు కూర్చోలేరు. వారి శరీరం సహకరించదు. ఫలితంగా- వెస్టర్న్ కమోడ్లను వినియోగిస్తుంటారు. కుర్చీల్లో కూర్చున్నట్టుగా ఉండటం వల్ల మోకాలి నొప్పులు కనిపించవు. రోజువారీ దినచర్యల్లో ఒక భాగమైన టాయ్‌లెట్‌లో కూర్చునే పొజీషన్ కూడా మన ఆరోగ్యాన్ని మెరగపరస్తుందని చెబుతున్నారు ఉపాసన.

  అయిదు నిమిషాలపై ఇలా కూర్చోగలరా?

  అయిదు నిమిషాలపై ఇలా కూర్చోగలరా?

  మోకాళ్ల మీద కూర్చోవడం అనేది భారతీయులు అనాదిగా పాటిస్తూ వస్తోన్న ఆరోగ్య సూత్రమని, ఇకపై దీన్ని పాటించడాన్ని అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇండియన్ టాయ్‌లెట్ పొజీషన్ ఛాలెంజ్‌ను చేపట్టినట్లు ఉపాసన వెల్లడించారు. టాయ్‌లెట్ పొజీషన్‌ను వివరిస్తూ రెండు ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అపోలో ఆసుపత్రిలో పనిచేస్తోన్న సీనియర్ ఆర్థోపీడియక్ సర్జన్లు డాక్టర్ కే జే రెడ్డి, డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుల ఛాలెంజ్‌ను ఉపాసన స్వీకరించారు. రోజూ కనీసం అయిదు నిమిషాల పాటైనా ఇలా కూర్చోగలరా? అంటూ ఛాలెంజ్ విసిరారు.

  చూడ్డానికి సులభంగానే కనిపించినా..

  చూడ్డానికి సులభంగానే కనిపించినా..

  మోకాళ్ల మీద కూర్చోవడం చూడటానికి చాలా సులభంగానే కనిపించినప్పటికీ.. దాన్ని పాటించడం కష్టమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తాను పోస్ట్ చేసిన ఇండియన్ స్టైల్ టాయ్‌లెట్ పొజీషన్ ఫొటోలకు ఈ కామెంట్స్‌ను జత చేశారు. చాలా మంది ఇలా కూర్చోవడానికి కష్ట పడతారని, ఇండియన్ టాయిలెట్ పొజిషన్‌లో అయిదు నిమిషాలైనా కూర్చోగలరా? అని ఛాలెంజ్ చేశారు. మే 3వ తేదీ నుంచి తాను టాయ్‌లెట్‌లో ఇలా మోకాళ్ల మీదే కూర్చుంటానని అన్నారు. రోజువారీ వ్యాయమంలో భాగంగా భావించాలని ఉపాసన సూచించారు.

  మెగా ఇంటి కోడలే అలా చేస్తే..

  మెగా ఇంటి కోడలే అలా చేస్తే..

  మన జీవనానికి ఉపయోగపడే సూత్రాలను ఎవ్వరు చెప్పినా కొందరు పెద్దగా పట్టించుకోరు. తాము అనుకున్నదే చేసేస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను దినచర్యల్లో ఒకటైన మల విసర్జన సమయంలో పాటించడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు ఉపాసన. మోకాళ్ల మీద అయిదు నిమిషాల పాటైనా కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ప్రత్యేకించి- యోగాసనాలను వేయలేని వారు కమోడ్‌పై ఇండియన్ స్టైల్‌లో మలవిసర్జన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

  English summary
  Upasana Kamineni Konidela, the Mega- daughter-in-law and wife of Mega Power Star Ram Charan, is an active user of social media sites. Upasana is a fitness freak. Ram Charan’ wife took to his Twitter and posted a picture of her squatting and also had asked people if they can sit in the ‘Indian toilet’ position for 5 minutes. Upasana also revealed that squatting position improves the flexibility and it is also a good weight bearing exercise that helps keep bones strong. It also involves the full range of movement which helps to get rid of stiffness in joints. Her post is receiving positive response by the netizens.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X