సూట్ కేసులు తెచ్చిన వారికే ప్రాధాన్యం: ప్రతాప్, అదేం లేదన్న ఉత్తమ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆశలను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నెరవేర్చలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి అన్ని పార్టీలు కలిసి రావాలని అన్నారు.
రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపునకు అందరూ సహకరించాలని ఉత్తమ్ కోరారు.
కాగా, తమ నేత ప్రతాప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయన పేరును కూడా హైకమాండ్‌కు పంపించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను పోటీకి నిలపాలన్న ప్రతిపాదనపై కూడా చర్చించామని ఆయన తెలిపారు.

స్థానిక నేతల అసహనం
వరంగల్ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే అభ్యర్థి ఎంపికపై స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లోకసభ అభ్యర్థి కోసం స్థానిక నేతల పేర్లను ఏఐసిసికి పంపకపోవడంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ అసహనం వ్యక్తం చేశారు. జెండాలు మోసిన వారికి అన్యాయం చేసి, సూట్ కేసులు తెచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని ప్రతాప్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications