ఢిల్లీలో సోనియాతో ఓయూ విద్యార్ధులు భేటీ: కేసీఆర్ జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వలేదు

న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భేటి ముగిసింది. సోనియా గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, ఓయూ విద్యార్ధులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్ పాలన, విద్యార్థుల సమస్యలపై వివరించారు.

ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఇప్పుడు జిల్లాకొకటి కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు సోనియా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆమె, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులు కూడా కష్టపడాలని సోనియా సూచించారు. అనంతరం మీడియాతో ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందుకు ఉస్మానియా విద్యార్ధులు సోనియాకు ధన్యవాదాలు తెలిపారని, తెలంగాణ పాటలు కూడా పాడారని వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలంటూ ఆమె సూచించారని తెలిపారు. ఇక ఉస్మానియా విద్యార్ధులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది విద్యార్థులు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేని చెప్పారు. కేసీఆర్‌ నియంతలాగా వ్యవహరిస్తున్నారనీ, ఓయూకు వీసీ, సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం కాలయాపనచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

uttam kumar reddy, ou students met sonia gandhi in delhi

అవకతవకలను ఎవరు పాల్పడిన చర్యలు తీసుకోవాలి: జానా రెడ్డి

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విపక్ష నేత జానా రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

ఇక ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలుంటే బయట పెట్టాలన్నారు. ఇందిరమమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను ఎవరు పాల్పడిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపించాలన్న ఆయన, అవకతవలకు పాల్పడ్డ వారు రాజకీయనాయకులైనా, ఉన్నాతాధికారులైనా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 లక్షల ఇళ్లు మంజారైతే అందులో 9 లక్షల ఇళ్లు మొదలు పెట్టలేదన్నారు. కేవలం 5 లక్షల ఇళ్లు మాత్రమే మొదలు పెట్టారన్నారు. వీటిలో కొన్ని ఇళ్లు నిర్మాణం పూర్తైతే మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయన్నారు.

ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజారు చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి గత ప్రభుత్వం రూ. 1000 కోట్ల కేటాయించిందన్నారు. ఆగిపోయిన వాటిని పూర్తి చేయకపోతే అటు ప్రభుత్వానికి, లభ్దిదారులకు నష్టమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+