లింక్ లేదు, బదులు తీర్చుకుంటాం: మురళి హత్య కేసుపై ఉత్తమ్

తెరాస కార్పొరేటర్‌ మురళి హత్యతో కాంగ్రెస్‌ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా కాంగ్రెస్‌ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారు.

వరంగల్‌: "తెరాస కార్పొరేటర్‌ మురళి హత్యతో కాంగ్రెస్‌ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు మిగిలిన ఇద్దరు నాయకుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌ నుంచి వెంటనే తొలగించాలి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా కాంగ్రెస్‌ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది సరికాదు.. 2019లో అధికారం కాంగ్రెస్‌దే" అని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

గద్దెనెక్కాక ఇంతకింత బదులు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం హన్మకొండలోని డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేటర్‌ మురళిని తామే హత్యచేశామని నిందితులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వారు చెప్పిన మాటలు నమ్మి రాజేందర్‌రెడ్డి, శ్రీమాన్‌, శేఖర్‌ పేర్లను ఛార్జీషీటులో పోలీసులు చేర్చడం సరికాదని, సీపీ సుధీర్‌బాబు, తెరాస నాయకుల పేర్లను వారు చెబితే చేర్చేవారా అని ప్రశ్నించారు.

Uttam Kumar Reddy said that Congress laders were not involved

2015 డిసెంబరులో మురళి హత్యకు పన్నాగం పన్నినట్లుగా పోలీసులు ఛార్జిషీటులో పొందుపర్చారు, 2015 నవంబరులో రాజేందర్‌రెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆయన విషాదంలో ఉన్నారు. కేవలం పది రోజుల్లోనే హత్యకు ఎలా పన్నాగం పన్నుతారని నిలదీశారు. వాస్తవాలను పరిశీలించి కాంగ్రెస్‌ నాయకుల పేర్లను తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు.

హోం శాఖ మంత్రి, డీజీపీలను ఇదే విషయమై ఇప్పటికే కలిసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న సంఘటలను చూస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడవుతోందన్నారు. తొలుత వడ్డేపల్లిలో గండ్ర రమణారెడ్డి నిర్మించిన అపార్టుమెంట్‌పై రాద్ధాంతం చేశారు, తర్వాత డీసీసీబీ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డిపై లేనిపోని అభాండాలు వేశారు.. తాజాగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేందర్‌ రెడ్డిని హత్య కేసులో అక్రమంగా ఇరికించారని వెల్లడించారు.

అనంతరం మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు, డీసీసీబీ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి, పీసీసీ ఉపాధ్యక్షుడు బక్క జడ్సన్‌, ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్‌, అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్‌, పీసీసీ కార్యదర్శులు ఈవీ.శ్రీనివాస్‌, బత్తిని శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కత్తి వెంకటస్వామిగౌడ్‌, పోశాల పద్మ, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సంజీవరెడ్డి, కార్పొరేటర్లు మౌనికారెడ్డి, రమా, తొట్ల రాజు, కొత్తపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ గ్రామీణ జిల్లా కేంద్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌ నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని, అందరితో మాట్లాడిన తర్వాత వైఖరిని త్వరలోనే వెల్లడిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటుచేయాలని స్థానిక నాయకులు ఎవరికి వారే ఆందోళనలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. వారం, పది రోజుల్లో వరంగల్‌ గ్రామీణ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వివరించారు. అందులో చర్చించిన తర్వాత పార్టీ వైఖరిని వెల్లడిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముందుగా సమాధానం చెప్పాలని, ఆ తర్వాత కాంగ్రెస్‌ వైఖరిని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కార్పొరేటర్‌ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

ఈనెల 13తేదీన కుమారపల్లిలో కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను హన్మకొండ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌రావు కథనం ప్రకారం.. కుమారపల్లి ప్రాంతానికి చెందిన కె.రాజ్‌కుమార్‌ ఆలియాస్‌ అంజీరాజు, జి.సాగర్‌ హత్యకేసులో నిందితులకు సహకరించారని తెలిపారు. హత్య జరిగే ముందు రాజ్‌కుమార్‌ నివాసంలో రాజ్‌కుమార్‌, సాగర్‌తో పాటుగా ముగ్గురు నిందితులు కలిసి ఉన్నారని చెప్పారు. అక్కడ నుంచే వారు మురళి ఇంటికి వెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. గోళ్లపల్లి పెట్రోల్‌పంపు వద్ద గురువారం వారిని అరెస్టు చేశామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+