రేణుకా చౌదరిపై సోనియా గాంధీకి ఫిర్యాదు: ఉత్తమ్

హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో శానససభ టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకురాలు రేణుకాచౌదరిపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ పిసిసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. వైరా అసెంబ్లీ స్థానాని కి కాంగ్రెస్ తరపున తన భర్త డాక్టర్ రాంజీ పోటీ చేయాలని భావించగా ఎంపీ రేణుకాచౌదరి టికెట్ ఇప్పిస్తానని రూ.1.10 కోట్లు వసూలు చేశారని డాక్టర్ భార్య చంద్రకళ ఆరోపిస్తున్నా రు.

రేణుకా చౌదరిపై చంద్రకళ గురువారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. టికెట్ రాకపోవటంతో మనస్తాపానికి గురై తన భర్త గుండెపోటుతో మృతిచెందారని, రేణుకాచౌదరి నుంచి డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. మూడు రోజుల కిం దట జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆమె ధర్నాకు దిగింది.

Uttam Kumar Reddy says complaint will be made on Renuka Choudhari to Sonia Gandhi

గురువారం ఖమ్మంలో నిర్వహించిన నంగారాభేరి లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలో కూడా రాంజీ సతీమణి ఇదే విషయాన్ని లేవనెత్తారు. సభకు హాజరైన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంపై స్పందించారు.

ఈ అంశాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదేక్రమంలో పలువురు గిరిజన నేతలు రేణుకా చీటర్ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+