కాంగ్రెస్ నేతల టార్గెట్ ఉత్తమ్ : పీసీసీ చీఫ్ గా రాజీనామా చేయాల్సిందేనా: పావులు కదులుతున్నాయి..!

ఇక..తెలంగాణ కాంగ్రెస్ లో వేగంగా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా. పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాల్సిందేనా. వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తమ్ వ్యతిరేకలు సొంత పార్టీ.. సొంత జిల్లాకు చెందిన నేతలు ఈ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలుత తన సతీమణిని అభ్యర్ధిగా ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలోనే వ్యతిరేకత మొదలైంది. స్వయంగా రేవంత్ రెడ్డి లాంటి వారు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

కానీ, ఢిల్లీలో మేనేజ్ చేయగలిగిన ఉత్తమ్ తన సతీమణికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇక, ఇదే సమయంలో తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పు అంశం పైన చర్చ జరిగినా..ఉప ఎన్నిక ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోవాలని పెండింగ్ పెట్టారు. ఇక, ఇప్పుడు వచ్చిన ఫలితం ద్వారా ఖచ్చితంగా పీసీపీ పగ్గాలు ఉత్తమ్ నుండి తప్పించే అవకశాలు కనిపిస్తున్నాయి. దీంతో..తెలంగాణలో కొత్త సమీకరణాల దిశగా వేగంగా పావులు కదులుతున్నాయి.

పీసీపీ చీఫ్ గా రాజీనామా చేయాల్సిందేనా..

పీసీపీ చీఫ్ గా రాజీనామా చేయాల్సిందేనా..

ఉత్తమ్ సీటు కిందకు నీళ్లు వస్తున్నాయి. సొంత నియోజకవర్గం. సిట్టింగ్ సీటు. ఎలాగైనా అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని బలమైన కోరికతో జరిగిన ఎన్నిక. కానీ, ఈ ఎన్నికలో కాంగ్రెస్ కంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు భారీ నష్టం చేసింది. ఆయన స్థానిక నేతలను కాదని..హైకమాండ్ ను ఒప్పించి తన సతీమణికి సీటు ఇప్పించుకున్నారు. గెలిపించే బాధ్యత తనదే అని చెప్పుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయింది. ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా ఉంది.

రాజీనామా చేయాల్సిన పరిస్థితి

రాజీనామా చేయాల్సిన పరిస్థితి

తాను కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్ నగర్ కోసం చేసిన పనులు..మరెక్కడా లేని విధంగా చేసిన ఇళ్ల మంజూరు..లెక్కకు లేని విధంగా నిర్మించిన ఎత్తపోతల పధకాలు తనను ఈ ఉప ఎన్నికల్లోనూ గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆర్టీసీ సమ్మెలో ప్రతిపక్ష పార్టీల భాగస్వామ్యం చూసిన తరువాత మరింతగా వారి మీద ఒత్తిడి పెంచే వ్యూహాలను అమలు చేస్తూ..హుజూర నగర్ లో అధికార పార్టీగా తమకు ఉండే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొంది. దీంతో..ఆయన పీసీపీ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ లో కనిపించని సమన్వయం..

కాంగ్రెస్ లో కనిపించని సమన్వయం..

అభ్యర్ధి ఎంపిక సమయంలోనే ప్రారంభమైన భిన్నా భిప్రాయాలు కాంగ్రెస్ లో చివరి వరకు కొనసాగాయి. రేవంత్ రెడ్డి జోష్ గా ప్రచారం చేసినా అది విజయానికి చేర్చలేక పోయింది. గట్టి పట్టు ఉన్న మండలాల్లో సైతం కాంగ్రెస్ డీలా పడింది. అధికార పార్టీ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కాగానే పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అధికార పార్టీ నేతలంతా అక్కడే మోహరించారు. గ్రామ గ్రామాన బాధ్యులను నియమిం చారు. ఇక, కాంగ్రెస్ లో మాత్రం మొత్తం బాధ్యతలు ఉత్తమ్ మీదనే మోపారు. ఉత్తమ్ సైతం ఒక విధంగా అతి విశ్వాసంతో కనిపించారు.

కాంగ్రెస్ లో చెప్పుకోదగిన స్థాయిలో

కాంగ్రెస్ లో చెప్పుకోదగిన స్థాయిలో

అధికారంలో ఉన్న పార్టీ అక్కడ ఎంతో కొంత ప్రభావం చూపించకలిగిన సీపీఐ వంటి పార్టీల మద్దతు కోసం ఆశ్రయిస్తే..చివరకు వారు మద్దతు ఇవ్వకపోయినా ఒంటరి పోరుతోనే సత్తా చాటింది. కాంగ్రెస్ లో చెప్పుకోదగిన స్థాయిలో రేవంత్ రెడ్డి మాత్రమే ప్రచారం చేసారు. పార్టీలోనే ఉన్నా పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి లాంటి వారిని ఒప్పించి ప్రచారానికి తీసుకురాలేక పోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించలేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+