రాహుల్ జాతీయతపై వ్యాఖ్యలు: స్వామి శాడిస్ట్ అంటూ విహెచ్ వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామిపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుబ్రమణ్య స్వామి బ్లాక్ మెయిలర్, శాడిస్ట్ అంటూ అభివర్ణించారు.
ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దిక్కుతోచని బీజేపీ నేతలు రాహుల్ జాతీయతపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని, కమీషన్ ఏజెంట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ మెప్పు కోసమే సుబ్రమణ్యస్వామి కావాలనే రాహుల్ గాంధీపై అబాండాలు వేస్తున్నారని ఆరోపించారు. తాను మేథావినంటూ వ్వవహరిస్తున్న స్వామికి ఏదో ఒకరోజు తగి శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. విచారణ జరిపించుకోండంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన సవాల్‌ను స్వీకరించాలని ప్రధాని మోడీని వీహెచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలను రాహుల్ గాంధీ సైతం తిప్పికొట్టారు. ‘‘ప్రధాని తన చంచాలతో నాపై బరద జల్లిస్తున్నారు. దమ్ముంటే నా నేరాన్ని రుజువు చేసి నన్ను జైల్లో పెట్టించండి'' అని సవాలు విసిరారు.
కాగా రాహుల్ గాంధీ సవాలుపై బీజేపీ స్పందించింది. ఆయన తమకు సవాలు విసరాల్సిన అవసరం లేదని, ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ తెలిపారు.

కాగా రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, ఆయన బ్రిటిష్ పౌరుడని సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధే స్వయంగా గతంలో ప్రకటించుకున్నాడని ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని కొన్ని పత్రాలను చూపించారు. రాహుల్ గాంధీని మొదట ఎంపీ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసారు.
ఈ మేరకు రాహుల్ గాంధీని బ్రిటిష్ జాతీయుడని పేర్కొన్న స్వామి రాహుల్ గాంధీని ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కోరుతూ ప్రధానికి, లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాసాడు. రాహుల్ గాంధీకి ఉన్న భారత పౌరసత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications