వందే భారత్ .. మేడిన్ తెలంగాణా.. వరమిచ్చిన కేంద్రం!
వందే భారత్ మేడ్ ఇన్ తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు అడుగులు పడుతున్న క్రమంలో ఈ శుభవార్త ప్రతి ఒక్కరిని సంతోషానికి గురిచేస్తుంది. కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రగతికి ఏ విధంగా దోహదం చేస్తుందో అర్థమయ్యేలా చెబుతుంది.
వందే భారత్ కోచ్ లు తెలంగాణలో తయారీ
భారతీయ రైల్వేలో త్వరలోనే తెలంగాణ పేరు అందరికీ తెలియబోతోంది. రైలు కోచ్ మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతున్న క్రమంలో దేశవ్యాప్తంగా దూసుకుపోయే వందే భారత్ రైళ్లకు కాజీపేట నుండి హై స్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేంద్రంగా వందే భారత్ కోచ్ లు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కేంద్రం కూడా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి మరింత దృష్టి సారించింది. సాధారణ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని భావిస్తున్న క్రమంలో కాజీపేట ఫ్యాక్టరీ కేంద్రంగా వందే భారత్ రైళ్లకు కావలసిన కోచ్ లు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆధునిక రోబోటిక్ యంత్రాల దిగుమతి
దీనికోసం బడ్జెట్ ను కూడా పెంచిన కేంద్రం వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో ముందుకు వెళుతుంది.
అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ తో కాజీపేట లో ఏర్పాటు చేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో రైలు కోచ్ లను తయారు చేయాలని భావిస్తోంది. దీనికోసం జపాన్ కి చెందిన టైకిష ఇంజనీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రోబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటుంది.
గతం కంటే బడ్జెట్ పెంచి రైల్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం దృష్టి
ఈ రైలు కోచ్ ఫ్యాక్టరీని 521 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తున్న క్రమంలో బడ్జెట్ ను అమాంతం పెంచింది మరో 150 కోట్లను అదనంగా కేటాయించి వందే భారత్ రైలు కోచులు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా భారతదేశంలోని వందేభారత్ మేడ్ ఇన్ తెలంగాణ అని చెప్పకునే రోజులు త్వరలోనే కేంద్రం ఇచ్చిన వరంతో రాబోతున్నాయి.












Click it and Unblock the Notifications