పగలు మాత్రమే చోరీలు చేస్తున్న వెరైటీ దొంగ.. రీజన్ ఏంటంటే ?

దొంగల్లో కూడా వెరైటీ దొంగ ఏంటా అని అనుకుంటున్నారా.. దొంగతనం చేయడం నేరం. అయితే కొందరు మాత్రం ఇదే వృత్తిగా కొనసాగే వారు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా దొంగతనాలు అంటే రాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు చేస్తారు అని అనుకుంటాం. దాదాపుగా అలానే జరుగుతూ ఉంటాయి. కానీ నా రూటే సపరేటు అంటున్నాడు ఓ దొంగ. అందరూ రాత్రి వేళ చీకట్లో చోరీలు చేస్తుంటే నేను మాత్రం పగలే దొంగతనం చేస్తా అని అంటున్నాడు.

ఈ రకంగా ఇప్పటికే పలు దొంగతనాలు చేసిన ఈ చోరుడు.. ఒక చోట 470 గ్రాముల బంగారం.. మరోచోట కూడా బంగారు ఆభరణాలు దొంగతనాలు చేసినట్టు గుర్తించారు. దొంగతనం చేయడమే కాకుండా చేసిన బంగారాన్ని సైతం బంగారు బిస్కెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. కేవలం తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా కర్ణాటక లోనూ ఈ దొంగ చేతివాటం చూపినట్టు చెబుతున్నారు పోలీసులు.

variety thief who steals only during the day What is the reason

ఇంత పక్కా ప్లాన్ తో దొంగతనాలు చేస్తున్న ఆ వ్యక్తి పేరు సుహాన్ ఖాన్‌. బెంగళూరుకు చెందిన ఈ దొంగ పక్కా ప్లాన్ తో ఇళ్లల్లోకి చొరబడి నగలు, డబ్బు కాజేస్తాడు. ఆ తర్వాత చోరీ చేసిన బంగారాన్ని కరిగించి, బంగారు బిస్కెట్లుగా మార్చి బంగారు దుకాణాలకు విక్రయిస్తాడు. అయితే ఈ వ్యవహారం అంతా కేవలం పగటి వేళ మాత్రమే చేస్తాడు. రీసెంట్ గా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని నారాయణమ్మ కాలనీలో జనవరిలో ఓ దొంగతనం చేశాడు. ఇంటిలో దాచుకున్న 470 గ్రాముల బంగారాన్ని చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. వారి ఫిర్యాదు మేరకు యాక్షన్ లోకి దిగిన పోలీసులు ఫిబ్రవరి 13న సుహాన్ ఖాన్‌ను కర్ణాటక జిల్లా తుమ్మకూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం బయటపెట్టాడు ఆ దొంగ. తనకి రేచీకటి ఉందని అందుకే కేవలం పగటి వేళ మాత్రమే దొంగతనం చేస్తానని ఒప్పుకున్నాడు. పెనుకొండలో బంగారు ఆభరణాలను బంగారు బిస్కెట్లుగా మార్చి రూ.29 లక్షలకు విక్రయించినట్లు తెలిపాడు. ఫిబ్రవరి 3న కుప్పంలో ఓ ఇంట్లో కూడా బంగారం చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బంగారాన్ని కరిగించడానికి కావాల్సిన ఆన్ లైన్ లో కొన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+