పోస్ట్‌ల వెనుక ఎవరున్నారో తేలాలి: పద్మ, ఎన్నికల టైంలో షర్మిల-ప్రభాస్ అంశాన్ని తెరపైకి తెచ్చారంటే
హైదరాబాద్: గత ఎన్నికల (2014) సమయంలోను షర్మిల పైన ఇలాగే ప్రచారం జరిగిందని, ఆ ఎన్నికల తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీంతో కొన్ని చర్యలు తీసుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ సోమవారం అన్నారు. షర్మిల పిర్యాదుపై ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.
నాడు ఫిర్యాదు, పోలీసులు కొన్ని చర్యలు తీసుకోవడంతో ప్రచారం కొంత ఆగిందని చెప్పారు. కానీ తమ పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రచారం మళ్లీ జరుగుతోందన్నారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక, గత ఆరునెలలుగా ప్రచారం చేస్తున్నారన్నారు.

షర్మిలపై పోస్టులు పెట్టిన వారి వెనుక ఎవరున్నారో తేలాలి
దీంతో షర్మిళ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇలా ప్రచారం చేయడం వెనుక ఎవరున్నారో విచారణలో తెలియాల్సి ఉందని చెప్పారు. టీడీపీ వైపు షర్మిల వేలు చూపించడం గురించి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... పోస్టులు ఎవరు పెట్టారో తెలియడంతో పాటు ఎవరు పెట్టమంటే వారు పెట్టారో కూడా తెలియాల్సి ఉందని చెప్పారు.

వ్యక్తిత్వ హననం కోసం టీడీపీ ప్రయత్నం
గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ వైఖరిని చూస్తున్నామని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు. వైయస్ కుటుంబం మీద, తమ పార్టీ నేతల మీద, ప్రత్యేకంగా జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నామని చెప్పారు. వైయస్ కుటుంబానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అసాసినేషన్) కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలియాలి
వైయస్ కుటుంబం పైన పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అన్ని విషయాలు బయటకు రావాల్సి ఉందని చెప్పారు. నేతలు అనేకమార్లు షర్మిల పర్సనల్ గురించి మాట్లాడారని చెప్పారు. టీడీపీ వెబ్‌సైట్లు లేదా వారి అనుబంధ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా గ్రూపుల్లో ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలియాలన్నారు.

ఎన్నికల సమయంలో షర్మిల-ప్రభాస్ అంశాన్ని తెరపైకి తెచ్చారా అంటే?
షర్మిల అంశాన్ని ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చారనే ఆరోపణల గురించి వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ... తాము గతంలోను ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ గత నాలుగు నెలలుగా మరింత ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు వీరు (వైయస్ కుటుంబం) ఎవరు కూడా ప్రజల ముందుకు ప్రచారం కోసం రాకుండా చేసేందుకు టీడీపీ కుటిలయత్నం చేస్తోందని, అలాంటప్పుడు మేం ఈ సమయంలో ప్రత్యేక విచారణ కోరుతున్నామని చెప్పారు.

జగన్ పైన హత్యాయత్నం కేసు చూశాము
ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న షర్మిల వ్యాఖ్యలను వాసిరెడ్డి పద్మ సమర్థించారు. జగన్ పైన విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందని, దీని వెనుక ఎవరున్నారో తేల్చకుండా దానిని ఓ సిల్లీ విషయంగా చెప్పే ప్రయత్నాలు చేసారని మండిపడ్డారు. కేసును చెత్తబుట్టలో పడేసే ప్రయత్నాలు చేశారన్నారు. కానీ హైకోర్టు ఆదేశాలతో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టడంతో ఇప్పుడు ఆ సంస్థ ఏపీలోకి ఎలా వస్తుందని అడుగుతున్నారని, ఇది విడ్డూరమని అభిప్రాయపడ్డారు.

టీడీపీ ప్రభుత్వం గుప్పెట్లో పోలీసులు
ప్రతిపక్ష నేతగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్‌ను చంపేందుకు ప్రయత్నాలు చేసే కేసును దర్యాఫ్తు చేయించలేమన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, దీంతోనే రాష్ట్ర పోలీసులను వారు ఎలా గుప్పెట్లో పెట్టుకున్నారో తేలిపోయిందని, అందుకే తాము హైదరాబాద్ పోలీసుల వద్దకు వచ్చామని చెప్పారు. తాము ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం తప్ప, ఇతర రాష్ట్రాల పోలీసులపై నమ్మకం లేదని చెప్పలేదన్నారు. అక్కడున్న టీడీపీ ప్రభుత్వం వైయస్ కుటుంబంపై కక్షతో వ్యవహరిస్తోందన్నారు. పోలీసులను వారి చేతుల్లో పెట్టుకున్నారని, అక్కడి పోలీసుల క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం లేదని, కానీ ప్రభుత్వం వారిని గుప్పెట్లో పెట్టుకుందన్నారు. అందుకే దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నామన్నారు.

వెనుక ఎవరున్నారో తేలాలి
షర్మిల పైన అసభ్య ప్రచారం చేసే వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా బయటకు రావాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. అదే తమ డిమాండ్ అన్నారు. దీనికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications