కాంగ్రెస్‌కు ఏపీ ప్రజలు అన్యాయం చేశారు: దిగ్విజయ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజనకు చివరగా ఒప్పుకొన్న తమ పార్టీని ప్రజలు అన్యాయంగా ఓడించారని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు అనుకూల సంకేతాలిచ్చిన తెలుగుదేశం, వైయస్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం ఓట్లు వేశారని ఆయన అన్నారు.
తెలంగాణ ఇచ్చినా అటు తెలంగాణలో కూడా ఓట్లు రాబట్టలేకపోయామని అన్నారు. ఈ విషయాల్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తాను ఇచ్చిన లేఖే కారణమని వరంగల్‌లో, విభజనకు కారణం కాంగ్రెస్సేనంటూ ఆంధ్రాలో చెప్పిన చంద్రబాబుకు ఓట్లు పడ్డాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది కష్టకాలమని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై పోరాడతామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటమార్చడం తగదన్నారు.
విభటన సమయంలో చట్టంలోని అన్ని అంశాలకు పార్లమెంట్‌లో బీజేపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ 8 నెలల పాలనలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఇందుకు నిదర్శనం ఢిల్లీ ఎన్నికలే అని అన్నారు.
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications