నల్లధనం అడ్రస్ తెలిసింది, కేసీఆర్‌కు థ్యాంక్స్: వెంకయ్య నాయుడు
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం చిరునామా తెలిసిందని, ఆ డబ్బుతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు.
సిద్దిపేట: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం చిరునామా తెలిసిందని, ఆ డబ్బుతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు.
ఆయన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో స్వచ్ఛశక్తి వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా అందరూ చూడాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అనేక కార్యక్రమాలు ప్రారంభించారని, దేశం ఆరోగ్యంగా ఉంటేనే శక్తిమంతంగా తయారవుతుందన్నారు. దేశం నుంచి పేదరికాన్ని పారద్రోలాలనేది ప్రధాని మోడీ ఉద్దేశం అన్నారు.

ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం చిరునామా తెలిసిందన్నారు.
సిద్దిపేటలో 2వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు. దసరా నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు.సిద్దిపేటలో వైకుంఠ ధామం, వైకుంఠ రథాలు ఏర్పాటు చేశామన్నారు.












Click it and Unblock the Notifications