'ఏపీ, తెలంగాణలకు ఎన్నారైలు సహకరించాలి': కాలిఫోర్నియాలో శ్రీకృష్ణ ఎన్టీఆర్ (పిక్చర్స్)
కాలిఫోర్నియా: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుజాతి గర్వించే వ్యక్తి అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
శ్రీకృష్ణుడిగా తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన ఎన్టీఆర్ పంచలోహ విగ్రహం అమెరికాలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.

కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహం
అన్నగా ముద్రపడిన ఎన్టీఆర్ యువకులు, విద్యావంతులను రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు కొనియాడారు.

కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహం
పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరు ఎన్టీఆర్ అన్నారు. టీడీపీని స్థాపించడంతో పాటు కాంగ్రెసేతర పక్షాలను ఒక్కతాటి పైకి తెచ్చారన్నారు.

కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహం
స్త్రీలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని చట్టం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని చెప్పారు. ఎన్టీఆర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 800 కిలోల బరువైన పంచలోహ విగ్రహాన్ని తయారు చేసిన వడయార్‌ను వెంకయ్య నాయుడు అభినందించారు.

కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహం
ప్రవాసాంధ్రులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ, ఏపీ చేపడుతున్న మన ఊరు కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు. స్వగ్రామాల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు.












Click it and Unblock the Notifications