ప్రాజెక్టులపై వ్యాఖ్యలు: కెసిఆర్‌పై ముప్పేట దాడి, బైరెడ్డి హెచ్చరిక

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ప్రాజెక్టు శంకుస్థాపన సభలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులే కాకుండా తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆర్డిఎస్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆర్డిఎస్‌ వద్ద కేసీఆర్‌ కుర్చీ వేసుకుని కూర్చుంటే తాము చేతులు ముడుచుకుని కూర్చోమని ఆయన బదులు ఇచ్చారు. రాయలసీమ పౌరుషం చూపిస్తామని బైరెడ్డి అన్నారు.

కేసీఆర్‌ సోయిలో ఉండి మాట్లాడుతున్నారా? లేక సోలి లేకుండా మాట్లాడుతన్నారా? అని దేవినేని ఉమామహేశ్వ రావు అడిగారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హుస్సేన్‌ సాగర్‌ను కాదు శుద్ధి చేయాల్సింది ముందు కెసిఆర్ నోటిని అని ఆయన అన్నారు.

Verbal attack on KCR: Byreddy Rajasekhar Reddy retaliates

తెలుగుదేశం పార్టీపై దాడి చేయాలని భావనతో కేసీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ భాష మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ఒక సీఎంగా ఉండి ఆడా... మగా అని మాట్టాడడం సిగ్గుచేటని, ముఖ్యమంత్రిగా ప్రజలకు నేర్పే సంస్కారం ఇదేనా? అంటూ మంత్రి దేవినేని ప్రశ్నాంచారు. కేసీఆర్‌ భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అయన అన్నారు.

సీఎంగా కేసీఆర్ తాను మాట్లాడే భాష మార్చుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యురాలు డికె అరుణ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చకుండా ఉంటాలంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్‌ను బ్యారేజీగా నిర్మిస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేసి ప్రజలకు నీళ్లివ్వాలని డిమాండ్‌ చేశారు.

పొంతనలేని మాటలతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు కేసీఆర్‌ మాయమాటలు చెప్పి పాలన సాగిస్తున్నారని అన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి పాతవాటిని మూలన పడేయొద్దని, ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఇక పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉండాలని అన్నారు.

పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన భాష తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రారంభించింది చంద్రబాబేనని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+