కెసిఆర్! సరే గానీ, అదేమిటో బయటపెట్టు: విహెచ్

హైదరాబాద్: అవినీతిని నిర్మూలిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖఱ రావు ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నానని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. అందుకు తగ్గట్టుగానే డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్యని బర్తరఫ్‌చేశాడని అంటూ అయితే రాజయ్య పాల్పడిన అవినీతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాజయ్య వద్ద రాజీనామా తీసుకునే అవకాశం ఉన్నా, కనీసం వివరణ కూడా కోరకుండా బర్తరఫ్‌ చేయడం వెనుక అవినీతి తీవ్రతను అర్ధం చేసుకుంటున్నానని ఆయన అన్నారు. అందుకే, ఆ కుంభకోణాన్ని ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత స్థాయి అధికారుల అవినీతిని కూడా కేసీఆర్‌ పట్టించుకోవాలని సూచించారు.

అవినీతిపరుడని పేరు తెచ్చుకున్న నవీన్‌ మిట్టల్‌ వంటిఅధికారులకు అత్యున్నత అధికారాలు కట్టబెడితే అవినీతి ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు.

 VH demands to reveal Rajaiah's corruption

అఖిల పక్షానికి ఎమ్మెల్యే డిమాండ్

చెస్ట్‌ ఆస్పత్రి తరలింపు పై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని పరిగి ఎమ్మెల్యే రామమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజలు, విద్యావంతులు, మేధావుల అభిప్రాయాలను గవర్నర్‌కి తెలియచేస్తామని ఆయన చెప్పారు. కోర్టుకు వెళ్లి అయినా ఆస్పత్రి తరలింపును అడ్డుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కెసిఆర్ అవివేకం..

ప్రభుత్వ భూములు అమ్మి ఖజానా నింపుకోవాలనుకోవడం అవివేకమని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే ప్రభుత్వ భూములు అమ్మడం ప్రారంభమైందని కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగించడం హేయమని ఆయన ధ్వజమెత్తారు.

చెస్ట్‌ ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని, ప్రభుత్వం వెంటనే ఆ ఆలోచన మార్చుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+