హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమజంట కనిపిస్తే.. పెళ్లే: భజరంగ్‌దళ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఎవరైనా ప్రేమికుల జంట పార్కుల్లో, రిసార్టుల్లో కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ హెచ్చరించింది. భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్ ఈ మేరకు హెచ్చరించారు. ప్రేమికుల రోజును నిర్వహించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు కోఠీలోని ఆంధ్రాబ్యాం సమీపంలోని షాప్‌ల్లో ప్రేమికుల రోజు గ్రీటింగ్ కార్డులను చింపి పారవేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమికుల రోజున కనిపించే జంటలకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చెబుతామని, తల్లిదండ్రుల సమక్షంలోనే జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి పెళ్లి చేస్తామని చెప్పారు.

ప్రేమకు కాదు.. విచ్చలవిడితనానికే వ్యతిరేకం: విహెచ్‌పి

భారతదేశం ఒక పవిత్రమైన దేశమని ఈ దేశానికి ఇతర దేశాల ఉత్సవాలు అక్కర్లేదని విశ్వహిందూ పరిషత్ పశ్చిమాంధ్ర నేత భరత్ వంశీ అన్నారు. దానిని కాదని ఎవరైనా కార్యక్రమాలను నిర్వహిస్తే తాము నిర్సరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. భజరంగ్‌దళ్ ఎప్పుడూ ప్రేమకు వ్యతిరేకం కాదని, పురాణ పురుషులంతా ప్రేమించి పెళ్లిచేసుకున్నవారేనని, అయితే ఇక్కడ ప్రేమ పేరుతో వ్యాపారం నడుస్తోందని, విచ్చలవిడితనం నడుస్తోందని భరత్‌వంశీ అన్నారు.

కోఠీలోని ఆంధ్రాబ్యాంకు సర్కిల్‌లో పెద్ద ఎత్తున గ్రీటింగ్ కార్డులను ధ్వంసం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, డి శంకర్, ప్రఖండ కన్వీనర్ సావిత్రీదేవి జైస్వాల్, జిల్లా మహిళా ప్రముఖ్ అశోక్ చందూ తదితరులు పాల్గొన్నారు. హోటళ్లు, పబ్‌ల్లో వాలెంటైన్స్ డే నిర్వహించాలని చూస్తే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశారు

విహెచ్‌పి, భజరంగ్‌దళ్

విహెచ్‌పి, భజరంగ్‌దళ్

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఎవరైనా ప్రేమికుల జంట పార్కుల్లో, రిసార్టుల్లో కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని భజరంగ్‌దళ్ హెచ్చరించింది

గ్రీటింగ్ కార్డుల దహనం

గ్రీటింగ్ కార్డుల దహనం

భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్ ఈ మేరకు హెచ్చరించారు. ప్రేమికుల రోజును నిర్వహించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు కోఠీలోని ఆంధ్రాబ్యాం సమీపంలోని షాప్‌ల్లో ప్రేమికుల రోజు గ్రీటింగ్ కార్డులను చింపి పారవేశారు.

గ్రీటింగ్ కార్డుల దహనం

గ్రీటింగ్ కార్డుల దహనం

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమికుల రోజున కనిపించే జంటలకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చెబుతామని, తల్లిదండ్రుల సమక్షంలోనే జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి పెళ్లి చేస్తామని చెప్పారు.

విహెచ్‌పి, భజరంగ్‌దళ్

విహెచ్‌పి, భజరంగ్‌దళ్

భారతదేశం ఒక పవిత్రమైన దేశమని ఈ దేశానికి ఇతర దేశాల ఉత్సవాలు అక్కర్లేదని విశ్వహిందూ పరిషత్ పశ్చిమాంధ్ర నేత భరత్ వంశీ అన్నారు. దానిని కాదని ఎవరైనా కార్యక్రమాలను నిర్వహిస్తే తాము నిర్సరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.

English summary
Bajrang Dal on Friday burnt greeting cards of the upcoming Valentine's Day at Koti in the city saying the event was not part of the Indian culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X