గజల్ శ్రీనివాస్ నీచుడు, గదిలో నగ్నంగా: బాధితురాలు కన్నీటిపర్యంతం

Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

  హైదరాబాద్: గజల్ శ్రీనివాస్ పచ్చిమోసగాడని లైంగిక వేధింపుల బాధితురాలు ఆరోపించారు. ఓ మీడియా ఛానల్‌తోమాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు, నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు.

  చదవండి: గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది: జైలుకు గజల్ శ్రీనివాస్, నో బెయిల్

  గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న సేవ్ టెంపుల్ వెబ్ రేడియో(ఆలయవాణి)లో తాను రేడియో జాకీగా పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపారు. తాను 8నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నానని, 4నెలలుగా గజల్ శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. రెండు నెలల నుంచి గజల్ శ్రీనివాస్ నుంచి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు.

  ఆ గదిలో శ్రీనివాస్ నగ్నంగానే..

  ఆ గదిలో శ్రీనివాస్ నగ్నంగానే..

  ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా ఉండేవాడని బాధితురాలు తెలిపారు. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని చెబితే ఎవరూ నమ్మరని తెలుసు, అందుకే సాక్ష్యాధారాలతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. అతడు పనిమనిషితో లైంగిక చర్యల్లో పాల్గొనే వాడని, ఆ వీడియోలను కూడా తాను పోలీసులకు సమర్పించానని తెలిపారు.

  ఆఫీసులో మరో వ్యక్తి..

  ఆఫీసులో మరో వ్యక్తి..

  గజల్ శ్రీనివాస్ సమాజానికి కనిపించేది ఓ వ్యక్తి అయితే.. ఆఫీసులో మరో వ్యక్తిలా ఉంటాడని తెలిపారు. తన కోరిక తీర్చాలని తనను గజల్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పినా వినరనే.. తనను తాను కాపాడుకునేందుకే తాను ఈ వీడియోలు, ఫొటోలు రహస్యంగా తీసినట్లు బాధితురాలు తెలిపారు.

  శ్రీనివాస్‌కి పనిమనిషితో శరీరక బంధం

  శ్రీనివాస్‌కి పనిమనిషితో శరీరక బంధం

  గజల్ శ్రీనివాస్‌తో శరీరకంగా సంబంధం కలిగిన పనిమనిషి మీడియాకు అవాస్తవాలు చెప్పారని అన్నారు. ‘నేను గజల్ శ్రీనివాస్‌తో సెక్స్‌లో పాల్గొంటాను. నీవు కూడా అలాగే చేయ్. నాక్కూడా ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు. అయినా నా భర్తకు తెలియకుండా చేస్తున్నా' అని పనిమనిషి తనను బలవంతపెట్టిందని బాధితురాలు తెలిపారు.

  బాధితురాలికి గజల్ బెదిరింపులు

  బాధితురాలికి గజల్ బెదిరింపులు

  లైంగిక వేధింపుల నేపథ్యంలో తాను జాబ్ వదిలేసి పోదామని నిర్ణయించుకున్నానని, అయితే, గజల్ శ్రీనివాస్ తనను బెదిరింపులకు గురిచేశాడని తెలిపారు. నీకు ఎక్కడా కూడా జాబ్ దొరక్కుండా చేస్తానని, ఫ్యూచర్ లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పారు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వనని, దొంగతనం లాంటి కేసులను కూడా పెడతానంటూ బెదిరించాడని తెలిపారు. అంతేగాక, ‘నేను చెప్పినట్టు చేయాలి అంటూ నన్ను చాలా దారణంగా వేధించేవాడు. నేను కాబోయే గవర్నర్‌ని. నేను చెప్పినట్టు చేస్తే నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా’ అని కూడా చెప్పాడని తెలిపారు.

  బయటేమో పేరు.. పలుకుబడి

  బయటేమో పేరు.. పలుకుబడి


  గజల్ శ్రీనివాస్ పీఏ పవన్ కుమార్, ఇతర ఆఫీసు సిబ్బందికి కూడా వేధింపుల విషయం చెప్పానని, వారు కూడా ఏం చేయలేమని చెప్పారని బాధితురాలు తెలిపారు. ‘గజల్ శ్రీనివాస్ శ్రీనివాస్ భార్యకు ఈ విషయం చెప్పినా ఆమె కూడా అందరిలానే నమ్మదనే చెప్పలేదు. అయితే, పనిమనిషి తనను వేధింపులకు గురిచేస్తోందని మాత్రమే చెప్పాను' అని బాధితురాలు తెలిపారు. గజల్ శ్రీనివాస్‌కు బయట పేరు పలుకుబడి ఉంది కాబట్టి.. ఆయన వేధింపులు చేస్తున్నారని తాను చెప్పినా.. ఎవరూ నమ్మరని ఆమె తెలిపారు. డిసెంబర్ 29న తాను పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

  చెప్పుతో కొట్టాలని ఉంది..

  చెప్పుతో కొట్టాలని ఉంది..

  తనను ఆఫీసులో పనిచేసుకోనివ్వకుండా వేధింపులకు గురిచేసేవాడని, ఇటీవల కాళ్లు కూడా పట్టించుకున్నాడని బాధితురాలు కన్నీటిపర్యాంతమయ్యారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇతని బారిన ఎంతమంది పడ్డారో తెలియదు గానీ, భవిష్యత్‌లో ఎవరూ కూడా బాధితులు కాకూడదనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు.

  వెంటనే స్పందించిన పోలీసులు గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. అతడ్ని తాను చెప్పుతో కొట్టాలన్న కోపంగా ఉందని ఆమె చెప్పారు. అయితే, పోలీసులు అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇలాంటి వేధింపులకుగురిచేసే వారిని అమ్మాయిలు ధైర్యంగా ఎదిరించాలని అన్నారు.

  12వరకు రిమాండ్

  12వరకు రిమాండ్

  లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈనెల 12 వరకు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు గజల్‌ శ్రీనివాస్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.

  ఆధారాలున్నాయిం ఏసీపీ

  ఆధారాలున్నాయిం ఏసీపీ

  మంగళవారం గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట పీఎస్‌లో ఏసీపీ విజయ్‌కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత మహిళ సమర్పించిన వీడియో దృశ్యాలు, అన్ని ఆధారాలను పరిశీలించాకే శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఆయన గత రెండు నెలలుగా బాధితురాలిని వేధిస్తున్నాడని, అందుకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె సమర్పించినట్లు వెల్లడించారు. తాను ఆధ్యాత్మికంగా జీవించే మహిళనని.. గజల్‌ శ్రీనివాస్‌ రెండు నెలలుగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరించిందంటూ ఆయన మహిళా అటెండర్‌పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Victim on gajal srinivas sexual harassments

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి