గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది: జైలుకు గజల్ శ్రీనివాస్, నో బెయిల్

Posted By:
Subscribe to Oneindia Telugu
  యువతిపై లైంగిక వేధింపులు.. గజల్ శ్రీనివాస్ అరెస్ట్..

  హైదరాబాద్: ఓ యువ‌తిని వేధించిన కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

  చదవండి: న్యూఇయర్: కార్లన్నీ ఖరీదైనవే, పోలీసులను వేడుకున్న యాంకర్ ప్రదీప్, ఏం జరిగిందంటే?

  మంగళవారం పోలీసులు ఆయ‌న‌ను నాంప‌ల్లి న్యాయస్థానంలో ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు ఈ నెల 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ బెయిల్ రాలేదు. దీంతో జైలుకు తరలించారు.

  చదవండి: శిక్ష తప్పదా, అడ్డంగా దొరికిన యాంకర్ ప్రదీప్‌కు షాక్ తప్పదా? కేసు నమోదు

  అరెస్టు చేసిన పోలీసులు

  అరెస్టు చేసిన పోలీసులు

  లైంగిక వేధింపుల ఆరోపణలతో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అతను వేధించారని ఓ మహిళ డిసెంబర్ 29వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

  రేడియో జాకీకి వేధింపులు

  రేడియో జాకీకి వేధింపులు

  మంగళవారం గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు రేడియో జాకీగా పని చేస్తున్నారు. వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న మహిళను గజల్ శ్రీనివాస్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఇటీవల అవి ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారని అంటున్నారు.

  గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించిట్లు దర్యాఫ్తులో

  గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించిట్లు దర్యాఫ్తులో

  గజల్‌ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు. గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

  వీడియో క్లిప్పింగుల ఆధారంగా

  వీడియో క్లిప్పింగుల ఆధారంగా

  టేపులు, వీడియో క్లిప్పింగుల ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలయవాణి వెబ్ సైట్ గజల్ శ్రీనివాస్‌దే అన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 354, 354ఏ, 509ల కింద కేసు నమోదు చేసినట్లు అంతకుముందు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A woman who worked at AalayaVani Web Radio, which is owned by Srinivas, alleged that the singer harassed her sexually and mentally for a long time, as per a report by gulte.com.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి