అలంపూర్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత: ఓటమి ఖాయం- అదే భయం..!!

గద్వాల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. పోలింగ్‌కు మూడు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకొక్క రోజే గడువు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. ఈ చివరి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.

ఈ పరిస్థితుల్లో జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. విస్తృత తనిఖీలు నిర్వహించారు.

 Vigilance and IT raids at Alampur Congress candidate Sampath Kumars residence

నియోజకవర్గం పరిధిలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో సంపత్ కుమార్ నివాసం ఉంటోన్నారు 11:45 నిమిషాల సమయంలో విజిలెన్స్, ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలను నిర్వహించడం కలకలం రేపింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. తనిఖీలు నిర్వహించారు.

అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో సంపత్ కుమార్ భార్య మహాలక్ష్మి భయాందోళనలకు గురయ్యారు. హై బీపీ వల్ల అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే సృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆమెను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.

సంపత్ కుమార్ ఇంటిపై విజిలెన్స్, ఐటీ అధికారుల దాడులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలియజేశారు. సంపత్ కుమార్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శాంతినగర్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 Vigilance and IT raids at Alampur Congress candidate Sampath Kumars residence

ఈ దాడుల పట్ల తెలంగాణ కాంగ్రెస్.. అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార బీఆర్ఎస్ ఓటమి ఖాయమైందనే విషయం స్పష్టమైందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకుల నివాసాలు, కార్యాలయాలపై ఐటి, విజిలెన్స్ దాడులు చేయిస్తూ భయ భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+