యాదాద్రి చానెల్ అధినేతగా విజయ్ భగవాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యాదాద్రి దూరదర్శన్ అధిపతిగా ఎం. విజయ భగవాన్ నియమితులయ్యారు. భారత బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసులో ఆయన సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు చానెల్ హెడ్‌గా పదోన్నతి కల్పించారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి.
ఆయన మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ దూరదర్శన్‌లో పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన టీవీ చానెల్‌కు మూడేళ్ల క్రితం యాదాద్రిగా నామకరణం చేసింది. ఆ తర్వాత కూడా ఆయన అందులోనే కొనసాగుతూ వచ్చారు.

కార్యక్రమాల రూపకల్పనలో, చానెల్ నిర్వహణలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. ఆయన 1986లో యుపిఎస్పీ ద్వారా ప్రోగ్రామ్ అఫీసర్‌గా నియమితులయ్యారు. పూనేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లోనూ, న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో శిక్షణ పొందారు.
దూరదర్శన్‌లో ఆయన వివిధ హోదాల్లోనూ వివిధ ప్రాంతాల్లోనూ పనిచేశారు. ఆయన హైదరాబాదుకు చెందినవారు. ఆయన టాగోర్స్ హోం, నిజాం కాలేజీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు.












Click it and Unblock the Notifications