Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయశాంతికి నెక్స్ట్ పదవి - ఢిల్లీ మార్క్ నిర్ణయం..!?

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ రోజు నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశా లు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. సీఎం రేవంత్ పార్టీ ఎమ్మెల్యే లను అప్రమత్తం చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయాలు ఒక్క సారిగా కొత్త టర్న్ తీసుకున్నాయి. ఎమ్మెల్సీలుగా ఖరారు చేసిన ముగ్గురు విషయంలోనూ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి త్వరలోనే మరో కీలక పదవి దక్కనుందనే ప్రచారం పార్టీ ముఖ్య నేతల్లో జరుగుతోంది.

రాములమ్మకు హామీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎంపికలో ఢిల్లీ మార్క్ కనిపించింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లో పని చేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరారు. టీఆర్ఎస్ ఎంపీగా ఉద్యమ సమయంలో పని చేసారు. ఆ తరువాత పార్టీలో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ టైం లోనే విజయశాంతికి కీలక పదవి ఇస్తామని.. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాక్రే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయశాంతి మౌనం దాల్చారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించినా అవకాశం దక్కలేదు. దీంతో, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసారు.

ఢిల్లీలో మంత్రాంగం
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీ అధ్యక్షుడు ఖార్గేతో ఢిల్లీలో భేటీ అయ్యారు. తాను పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం - పార్టీ వ్యవహారాల గురించి వారితో చర్చించారు. తనకు అవకాశం ఇవ్వాలని.. పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ తో విజయశాంతికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సమయంలో అవి ఎమ్మెల్సీ పదవి రావటానికి సహకరించాయి. ఇక, విజయశాంతికి ఎమ్మెల్సీ ఖరారు కావటం కాంగ్రెస్ లో ఆసక్తి కర చర్చకు కారణమైంది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌తో పాటు విజయశాంతికి ఆ పార్టీ అధిష్ఠానం టికెట్లు ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఉద్యమ నాయకురాలిగా తనకు అవకాశం దక్కిందని విజయశాంతి పేర్కొన్నారు.

vijayasanthi-chances-to-induct-in-revanth-cabinet-soon-as-reports

హైకమాండ్ హామీతో
సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చానని విజయశాంతి స్పష్టం చేసారు. బీఆర్ఎస్ పాలన పైన మండిపడ్డారు. ఇదే సమయంలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్త రణలో విజయశాంతికి అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తున్న వారిలో మార్పులు - చేర్పులు ఖాయమని చెబుతున్నారు. కొత్తగా ఆరుగురికి రేవంత్ మంత్రివర్గంలో అవకాశం ఉంది. కీలకమైన హోం, మున్సిపల్, విద్యా శాఖ లు రేవంత్ వద్దే ఉన్నాయి. కొందరు మంత్రులు అదనపు శాఖల నిర్వహణ భారంగా భావిస్తున్నారు. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ కోసం హైకమాండ్ తేల్చటం లేదు. పలువురు ఆశావాహులు ఢిల్లీ లో హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ 15 నెలలు పూర్తయినా.. ఇంకా మంత్రివర్గ విస్తరణకు అనుమతి దక్కటం లేదు.

ఢిల్లీ నిర్ణయం
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న పరిణామాలతో దూకుడుగా వ్యవహరించే వారిని ప్రోత్సహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కు సరైన కౌంటర్ చేసే నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అందులో భాగంగా విజ‌య‌శాంతితో పాటు మ‌రికొంద‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌ని అధిష్ఠానం ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిందని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై సుప్రీంకోర్టులో కేసు కీలక దశకు చేరుకుంది. వారి విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది కీలకంగా మారుతోంది. ఇక.. స్థానిక సంస్థల ఎన్నికల పైనా కసరత్తు జరుగుతోంది. దీంతో.. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే డిమాండ్ ఢిల్లీలో పార్టీ నేతలు వినిపిస్తున్నారు. ఇక.. మంత్రివర్గ విస్తరణ జరిగితే విజయశాంతికి పదవి ఖాయమని చెబుతున్న వేళ..హైకమాండ్ నిర్ణయం ఏంటి.. రేవంత్ స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

రేవంత్ ఆలోచన ఏంటి
ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం - పార్టీలో తన పట్టు కొనసాగిస్తున్నారు. తాజాగా పార్టీ నేతల మధ్య సమన్వయం లేక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓడిపోయామని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారంలో లేని సమయంలో గెలిచిన ఎమ్మెల్సీ సీటు..అధికారంలోకి వచ్చిన తరువాత ఓడటం పైన పార్టీ హైకమాండ్ సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితులు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు పథకాల అమలు పైనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇటు పార్టీలోనూ పదవుల కోసం ఒత్తిడి పెరుగుతోంది. సుప్రీంలో పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీ పైన నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ ద్వారా తనకు మద్దతుగా ఉంటూ.. బలమైన వాయిస్ వినిపించేవారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ సమయంలో విజయశాంతి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపిస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ తన మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలతో సిద్దంగా ఉన్నారు. ఈ సమయంలో విజయశాంతికి కేబినెట్ లో అవకాశం ప్రతిపాదనల పై రేవంత్ స్పందన కీలకంగా మారనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+