కరోనాకు పారాసిటామాల్ చాలట .. వరంగల్ లో కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి వ్యంగ్యం

బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కెసిఆర్ తుగ్లక్ లాగ వాగ్దానాలు చేస్తున్నారని, ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పుడు వాటి ఊసు కూడా ఎత్తకుండా మళ్లీ కొత్తగా అబద్ధాలు మొదలు పెట్టారని విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కరోనాకు పారాసిటమాల్ చాలని చెబుతున్నారు అంటూ మండిపడ్డారు.

 సీఎం గారి మానసిక స్థితి సరిగా లేకనా ఇదంతా

సీఎం గారి మానసిక స్థితి సరిగా లేకనా ఇదంతా

తెలంగాణ ప్రజలు అమాయకులనా .. లేక సీఎం గారి మానసిక స్థితి సరిగా లేక ఇదంతా జరుగుతుందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన విజయశాంతి, జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అని చెప్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అప్పుడు వరంగల్ ఐటీ హబ్ అన్నారు .. ఇప్పుడు మెడికల్ హబ్ అంటున్నారు

అప్పుడు వరంగల్ ఐటీ హబ్ అన్నారు .. ఇప్పుడు మెడికల్ హబ్ అంటున్నారు

గతంలో ఇచ్చిన హామీలను మరిచి ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్నారని, గతంలో డల్లాస్, న్యూయార్క్ ,చికాగో, ఇస్తాంబుల్ వాగ్దానాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేరలేదు అన్నారు.వరంగల్ ఐటి హబ్ అన్నారని, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పారని, కుర్చీ వేసుకొని కూర్చుని ఇళ్ళు పూర్తి చేసి కల్లు తాగి దావత్ చేసుకుంటామని అన్నారని, ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయాయో తెలియదంటూ విమర్శించారు.

అనాలోచిత హామీలు ఇస్తున్న సీఎం కేసీఆర్

అనాలోచిత హామీలు ఇస్తున్న సీఎం కేసీఆర్

ధనిక రాష్ట్రం అని చెబుతున్న సీఎం గారు డబ్బులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు విజయశాంతి. కేవలం చేయడం ఇష్టం లేకనా లేక సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారా అంటూ విజయశాంతి కెసిఆర్ పై విరుచుకుపడ్డారు.సీఎం కేసీఆర్ అనాలోచితంగా హామీలు ఇచ్చుకుంటూ జిల్లాలు తిరుగుతున్నాడని, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని విజయశాంతి అన్నారు. తెలంగాణ సమాజంలో సీఎం కేసీఆర్ ఆలోచన సమతుల్యత పై సందేహాలు వస్తున్నాయి అన్న అభిప్రాయాలు బలపడుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.

 వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం వ్యాఖ్యలపై విజయశాంతి సెటైర్లు

వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం వ్యాఖ్యలపై విజయశాంతి సెటైర్లు

సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో మాట్లాడుతూ తనకు కరోనా వచ్చినప్పుడు రెండు పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకున్నాను అని చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు వరంగల్ మెడికల్ హబ్ చేస్తామని, హైదరాబాద్ కు ధీటుగా తయారు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+