ప్రధాని మోడీ పర్యటన వేళ విజయశాంతి సంచలన పోస్ట్!!

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు రానున్నారు. వరంగల్ లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఓరుగల్లుకు చేరుకుంటున్నారు. బిజెపిలో వరంగల్ కేంద్రంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

కావాలని బిజెపి, బీఆర్ఎస్ ఒకటే అనే సంకేతం వెళ్లేలాగా దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో మండిపడిన విజయశాంతి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనందువల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న సంకేతం వెళుతుందని, అలాగే తమ్ముడు సంజయ్ గారిని మార్చడం బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర అనీ... అందుకే కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. బీజేపీ తగ్గుతున్నదనే ప్రచారం బీజేపీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేక మీడియా చేస్తుందని సంచలన పోస్ట్ చేశారు.

vijayashanthimodi

ఇక ఇందులోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గమనించివలసింది కూడా ఒకటున్నదన్న రాములమ్మ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే ఆ వ్యతిరేక ప్రత్యేక ఓటు బీఆర్ఎస్‌కు కూడా వ్యతిరేకమై కేసీఆర్ గారి ఓటమికి పనిచేస్తది కదా? అంటూ ఆమె పేర్కొన్నారు.అలా అయితే కవిత గారి అరెస్టు అందరికన్నా అత్యంత అవసరం కేసిఆర్ గారికే కదా... మరి బీఆర్ఎస్ అందుకోసం డిమాండ్ చేస్తదా? అంటూ ప్రశ్నించారు.

Vijayashanti

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణ జరిగినప్పుడు అంత ఆత్రంగా కవితతో పాటు మందీ మార్బలాన్ని ఢిల్లీ పంపడం సానుభూతి కోసం ఆడిన డ్రామానా? బీఆరెస్, బీజేపీ ఒక్కటే అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? బట్ట కాల్చి బీజేపీ మీదేసి దెబ్బ తీస్తాం... వదిలించుకొని బయట పడాల్సింది బీజేపీయే అనే దుర్మార్గాన్ని తన అనుకూల మీడియా ద్వారా కేసిఆర్ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే బీఆరెస్‌కి నష్టం... అదే కాంగ్రెస్ కు కొంచెం ఎక్కువ వస్తే బీఆరెస్‌కి మేలు అని చెప్పడానికి గత ఎన్నికలప్పుడు చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం అని విజయశాంతి పేర్కొన్నారు. మళ్లీ అలాగే జరగాలని గులాబీ అధినేత కోరుకుంటున్నారని విజయశాంతి అన్నారు.

అందుకే ఈ కుట్రలకు తెరలేపారు. ఒకవైపు మళ్లీ అధికారం తమదేనని చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ అధిపతికి ఈ వంచనలెందుకు? గెలుపుపై అంత ధీమా ఉన్నప్పుడు ఈ మోసాలెందుకు? అంటూ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+