వరుస మరణాలు: ఇళ్లకు తాళాలు, ఊరిని ఖాళీ చేసిన ప్రజలు

వరుస మరణాలు సంభవిస్తుండడంతో కీడు వచ్చిందనే ఆందోళనతో ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి పొలిమేర దాటి వెళ్లారు.

ఖమ్మం : గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు జరుగుతుండటం, అది కూడా వారం రోజుల వ్యవధిలో జరగడంతో కీడు వచ్చిందని పండితుల సూచన మేరకు గ్రామస్తులు ఒక రోజు గ్రామం విడిచి వనాలకు చేరారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరు పొలిమేర దాటి ఉండాలని అనడంతో గ్రామస్తులు తెల్లవారు జామునే తట్టబుట్ట సర్దుకుని ఇండ్లకు తాళాలువేసి వెళ్లారు.

ఖమ్మం రూరల మండలం ఏదులాపురం గ్రామపంచాయతీ వరంగల్‌ క్రాస్‌రోడ్డు ఏరియాలో గడిచిన రెండు నెలల నుండి వివిధ కారణాలతో వారం పది రోజుల వ్యవధిలో మరణాల సంభవించాయి. కారణాలు ఏదైనా గ్రామంలో వరుస మరణాలపై ఆందోళన చెందిన గ్రామస్తులు పండితులను సంప్రదించారు.

Village evacuated with serial deaths in Khammam district

క్రాస్‌రోడ్డు నందు ఆంజనేయస్వామి ఆలయానికి ధ్వజస్తంభం లేదని దీంతో గ్రామానికి ఒక రోజు మొత్తం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గ్రామం విడిచి వెళ్ళాలని, గ్రామంలో ఆ రోజు మొత్తం గ్రామంలోని ఇండ్లలో ఎటువిం కార్యక్రమాలు చేయకూడదని చెప్పడంతో గ్రామస్తులు మంగళవారం తెల్లవారుజామున బయల్దేరి ఊరి పొలిమేరలు చేరారు.

దీనిలో భాగంగా కొందరు శివారు గ్రామమయిన ఆరెంపుల శివారులలోని తోగలలో, దర్గాలలో ఉండేందుకు వెళ్లగా ఆ గ్రామానికి చెందిన స్థానికులు తమ గ్రామానికి ఎక్కడ కీడు వస్తుందోనని వారిని అక్కడ నుండి తిప్పి పంపినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+