వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో ఉపాధి కూలీలుగా గ్రామ సర్పంచ్ లు: కేసీఆర్ ప్రభుత్వ పల్లెప్రగతి ఇదేనా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పల్లెలపై పెడుతున్న శ్రద్ధ, పల్లెల అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులు ఏ విధంగా ఉన్నాయి అన్నదానికి కూలీలుగా మారుతున్న సర్పంచుల జీవితాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి.

దుర్భర స్థితిలో తెలంగాణా రాష్ట్ర గ్రామాల సర్పంచ్ లు

దుర్భర స్థితిలో తెలంగాణా రాష్ట్ర గ్రామాల సర్పంచ్ లు

ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం పని చేయాల్సి ఉండగా, గ్రామ అభివృద్ధి మాట అటుంచి వారి బ్రతుకులు దుర్భరంగా మారుతున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలలో కనిపిస్తున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విశ్వనాథ కాలనీ గ్రామ సర్పంచ్, అలాగే కామారెడ్డి జిల్లా లోని సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ సర్పంచ్ కూలీలుగా మారిన పరిస్థితి గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కు అద్దం పడుతుంది.

అప్పు తెచ్చి అభివృద్ధి పనులు.. కూలీగా మారిన మర్కల్ సర్పంచ్

అప్పు తెచ్చి అభివృద్ధి పనులు.. కూలీగా మారిన మర్కల్ సర్పంచ్


మర్కల్ గ్రామ సర్పంచ్ జూకంటి సంగారెడ్డి గ్రామాభివృద్ధి కోసం 3,50,000 అప్పు చేసి మరీ ఊళ్లో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేయించాడు. ఇక గ్రామ అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన తన భార్య నాగలక్ష్మి తో కలిసి కొద్ది రోజులుగా ఉపాధి హామీ కూలిపనులకు వెళుతున్నారు. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులతో పాటుగా, 15వ ఆర్థిక సంఘం నిధులు జనవరి నుంచి పెండింగ్లోనే ఉన్నట్టు ఆయన తెలిపారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు కేటాయించి, సర్పంచులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

హన్మకొండ జిల్లా విశ్వనాథ కాలనీ గ్రామ సర్పంచి ఉపాధి కూలీగా

హన్మకొండ జిల్లా విశ్వనాథ కాలనీ గ్రామ సర్పంచి ఉపాధి కూలీగా

ఇదిలా ఉంటే హనుమ కొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విశ్వనాథ కాలనీ గ్రామ సర్పంచి పరిస్థితి కూడా అంతే దయనీయంగా మారింది. నూతనంగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయిన వల్లెపు అనిత గ్రామంలో పలు అభివృద్ధి పనులకు తన సొంత నిధులను ఖర్చు చేశారు. గ్రామాభివృద్ధికి ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేశారు. ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు కాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో తన భర్తతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు వల్లెపు అనిత.

నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్న సర్పంచ్ లు

నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్న సర్పంచ్ లు


తనకు రావలసిన బిల్లులు ఎనిమిది లక్షలకు పైగా పెండింగ్లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు, డీజిల్ ఖర్చు తదితరాలకు కూడా సరిపోవడం లేదని వల్లెపు అనిత తెలిపారు. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా వీరిద్దరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గ్రామ అభివృద్ధి కోసం సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచులు ప్రభుత్వం నుంచి నిధులు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దుర్భర జీవితాలను గడుపుతున్న సర్పంచ్ లు

దుర్భర జీవితాలను గడుపుతున్న సర్పంచ్ లు

ప్రభుత్వ తీరుతో సర్పంచులు అప్పులపాలవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కి సతమతం అవుతున్నారు. పేరుకు సర్పంచులు కానీ, దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఇక ఈ పరిస్థితుల నుంచి వారిని గట్టెక్కించిన బాధ్యత ఇది చేశాం.. అది చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం పై ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచుల కష్టాలపై దృష్టిసారిస్తోందో లేదో వేచి చూడాలి.

English summary
Village sarpanches are becoming employed laborers in Telangana. Sarpanches are indebted due to non-receipt of funds spent on development works by the KCR government administration. Are demanding funding and support
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X