టిమ్స్ ఇంచార్జీ విమలా థామస్..? పెరగనున్న టెస్టుల సామర్థ్యం, కోల్‌కతాకు కోబొస్ మిషన్లు: ఈటల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దాటుతున్నాయి. టెస్టుల సంఖ్య పెరగడంతో పాజిటివ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రెసెర్చ్ (టిమ్స్) ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల్లో టిమ్స్ అందుబాటులోకి వస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టిమ్స్ నిర్వహణ బాధ్యతలు, విధుల నిర్వహణపై కూడా ఈటల రాజేందర్ స్పష్టతనిచ్చారు.

విమలా థామస్ ఇంచార్జీ..
ప్రొఫెసర్ విమలా థామస్ టిమ్స్ ఇన్ చార్జీ బాధ్యతలు చేపడుతారని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని అధికారులకు స్పష్టంచేశామని చెప్పారు. టిమ్స్‌లో 1500 నుంచి 2 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 50 శాతం సిబ్బందితో వారానికి ఒక షిప్టులో వైద్య సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. టిమ్స్ అందుబాటులోకి రావడంతో.. కరోనా వైరస్ సోకిన రోగులకు మరింత నాణ్యతతో వైద్యం అందజేస్తామని పేర్కొన్నారు.

పెరగనున్న టెస్టులు
ప్రభుత్వ ల్యాబులతో రోజుకు 2290 టెస్టులు వేస్తున్నామని.. ఈ సంఖ్య మరింత పెరుగతుందని సంకేతాలు ఇచ్చారు. వారం రోజుల్లో 4310 టెస్టుల సామర్థ్యం పెరుగుతోందని.. దీంతో రోజుకు 6600 మందికి పరీక్షలు చేయబోతున్నామని ప్రకటించారు. 104, 108 కాల్ సెంటర్లు మరింత పకడ్బందీగా పనిచేస్తాయని తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ లేకుంటే 104కి కాల్ చేయాలని సూచించారు.

మొక్కుబడి సాయం
రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, ఇందులో అనుమానానికి తావులేదన్నారు. కానీ కొందరు స్వార్థ రాజకీయాల కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారు ఎప్పుడూ మాటలకే పరిమితం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టండి అని, దీపాలు వెలిగించాలని మాటలే చెబుతున్నారే తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. మొక్కుబడిగా రూ.214 కోట్ల సాయం చేసి.. చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.
Recommended Video

కోల్ కతాకు కోబోస్ మిషన్లు
రాష్ట్రంలో టెస్టులు తక్కువ అని అంటోన్న బీజేపీ నేతలు.. కేంద్రం చేసిన వివక్ష గురించి ప్రస్తావించారు. రోజుకు 3500 నుంచి 4 వేల పరీక్షలు చేసే రోస్ కంపెనీకి చెందిన కోబోస్ మిషన్లను తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ చేసిందని తెలిపారు. 8800 మిషన్లు దేశానికి వస్తే.. వాటిని కోల్ కతాకు పంపి.. తెలంగాణపై చిన్నచూపును చాటుకున్నారని మండిపడ్డారు. కానీ ఆ పార్టీ నేతలే టెస్టులు చేయడం లేదని.. ఆందోళన చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications