viral video: నిర్మల్ రోడ్లపై చేపల వేట -పరిస్థితిపై మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ -మరో 24 గంటలు..
తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వరద ఉప్పొంగడంతో నిర్మల్ జిల్లా కేంద్రం నీట మునిగింది. భైంసాలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిర్మల్ పట్టణంలోని వరద ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. జిల్లాలోనే ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో గురువారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు.
నిర్మల్ జిల్లాలో అసాధారణ రీతిలో వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ కు సూచించారు.

మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. సహాయక చర్యలు చేపట్టడానికి నిర్మల్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామన్నారు. మరోవైపు,

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాగు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వాటిని పట్టుకునేందుకు జనం పరుగులు పెట్టారు.

వలలు, చీరలతో రోడ్లపైనే చేపలను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఒక కిలోను మించి బరువున్న చేపల్ని కొందరు దొరకబుచ్చుకున్నారు. నిర్మల్ రోడ్లపై చేపల వేటకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Recommended Video
With lakes and streams full and water spilling on to roads due to heavy rains, locals who noticed fish run to catch some in #Nirmal#TelanganaRains pic.twitter.com/Siap04exxn
— Syed Rizwan Qadri (@Qadrisyedrizwan) July 22, 2021












Click it and Unblock the Notifications