ఓటుకు నోటు కేసు: కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసిబి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసిబి అధికారులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా అరెస్ట్ చేయగా, కోర్టు నుంచి వీరు బెయిలు పొందిన సంగతి తెలిసిందే.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 50లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. కాగా, ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారిన ఆడియో, వీడియో టేపుల వాస్తవికతను నిర్ధారిస్తూ రూపొందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఏసీబీ కోర్టుకు చేరింది.
తాజాగా ఆ టేపుల్లోని స్వరాలతో నిందితుల స్వరాలను పరిశీలించే ప్రక్రియకు కూడా తెర లేచింది. కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల స్వర నమూనాలను అందించాలన్న ఏసీబీ కోర్టు అభ్యర్థనకు తెలంగాణ అసెంబ్లీ స్పందించింది.

ఆయా సందర్భాల్లో రేవంత్, సండ్రలు ప్రసంగించిన ఆడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు గురువారం కోర్టుకు సమర్పించారు. అదే సమయంలో కేసులో మరో కీలక నిందితుడిగా ఉంటూనే ఏసీబీ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన జెరూసలెం మత్తయ్యతో పాటు మరో నిందితుడు సెబాస్టియన్ లు వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడిన ఆడియో ఫుటేజీలను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు.
అసలు టేపులతో నిందితుల స్వరాలను పోల్చేందుకు అందిన స్వర నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని ఏసీబీ అధికారులు గురువారమే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిరువురితోపాటు సెబాస్టియన్, ఉదయసింహ మీడియాతో మాట్లాడిన టేపులను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్వేషణకు అందజేయాలంటూ ఏసిబి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, దీనిపై రెండ్రోజుల్లోగా కోర్టు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications