తెలంగాణలో ఓట్ల చోరీ వివాదం - కాంగ్రెస్ vs బీజేపీ రాజకీయ యుద్ధం

తెలంగాణా రాష్ట్రంలో ఓట్ల చోరీపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓట్ల చోరీ అంశం అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణమైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కోట్లాది ఓట్లను కుట్ర పూరితంగా తొలగించారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణం అయింది.

తాజాగా హైదరాబాద్‌లోని బిఆర్‌కే భవన్‌లో కాంగ్రెస్ భారీ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని మెమోరాండం సమర్పించిన భట్టి, పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Vote Theft Controversy in Telangana Turns into Political War Between Congress and BJP allegations and challenges

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ దాడికి బీజేపీ ఎదురు దాడి ప్రారంభించింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్డులో ఎలక్షన్ కమిషన్‌పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని బిజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు.

రాజ్యాంగబద్ధమైన సంస్థలను బెదిరిస్తూ, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణచివేస్తోందని ఆయన ఆరోపించారు. రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

చారిత్రక కట్టడాలను కాపాడే దిశగా పాతబస్తీ మెట్రో అలైన్మెంట్ మార్పులు!
చారిత్రక కట్టడాలను కాపాడే దిశగా పాతబస్తీ మెట్రో అలైన్మెంట్ మార్పులు!

ఈ సీఈసీ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఇలా అధికార , ప్రత్యర్ధి పార్టీల మధ్య ఓట్ల చోరీ అంశం ఒకరిని ఒకరు టార్గెట్ చేయటానికి అస్త్రంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+