వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటరు జాబితా సవరణ ప్రత్యేక క్యాంపెయిన్.!యువత సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నవంబర్ 27,28 తేదీలలో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నగర పాలక అధికారులు సూచిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఓటరు సభ్యత్వం నమోదు చేసుకోబోయే యువకులు వినియోగించుకోవాలని సనత్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఈఅర్ఓ బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ పి ముకుంద రెడ్డి స్పష్టం చేస్తున్నారు. బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో ఓటరు అవగాహన కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ 2021 సంభందించిన ముసాయిదా ఓటరు జాబిత విడుదల చేసినందున ఓటరు జాబితా లో చేర్పులు మార్పుల కోసం నవంబర్ 27, 28 తేదీలలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యం లో పోలింగ్ బూత్ స్థాయి అధికారులు పోలింగ్ బూత్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటు లో ఉంటారని అధికారులు స్పష్టం చేసారు.

Voter List Amendment Special Campaign.!Authorities want to benefit the youth.!

ఇక అదే సమయం లో ఓటరు జాబితాలో గల మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నందున నగర ప్రజలందరూ ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి1, 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు కూడా నూతన ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జాతీయ సేవ సర్వీసెస్ ప్రోగ్రామ్ అధికారి స్వీప్ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు ఓటరు నమోదు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా జరగబోవు సార్వత్రిక ఎన్నికలను నూతన ఓటర్లు ప్రభావితం చేస్తే స్ధాయిలో నూతన ఓటర్లు తమ నమోదు ప్రక్రియను ప్రారంభించాలని అధికారలు విజ్ఞప్తి చేపారు. ఇదే కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

English summary
City officials have indicated they will hold a special campaign on November 27,28 to amend the voter list. He urged everyone to take advantage of this opportunity, especially the youth who are going to register as voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X